Thalapathy Vijay: విడాకుల కోసం దళపతి విజయ్ అన్ని కోట్లు భరణంగా ఇస్తున్నారా? నిజమేనా?

Thalapathy Vijay: దళపతి విజయ్, సంగీత విడాకుల వార్తలు కోలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. భరణం కింద రూ. 250 కోట్లు ఇస్తున్నట్లు ప్రచారం
x

Thalapathy Vijay

Highlights

Thalapathy Vijay: దళపతి విజయ్, సంగీత విడాకుల వార్తలు కోలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. భరణం కింద రూ. 250 కోట్లు ఇస్తున్నట్లు ప్రచారం. పూర్తి వివరాలు..

Thalapathy Vijay: కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ , ఆయన భార్య సంగీత వైవాహిక జీవితం గురించి గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్తల మధ్య , విజయ్ తన భార్యకు రూ.250 కోట్ల భరణం చెల్లించడానికి ముందుకొచ్చారని వార్తలు వచ్చాయి. తాజాగా నటి త్రిష తో కల్సి విజయ్ ఒక వివాహ వేడుకకు హాజరు కావడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత వచ్చింది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. విజయ్ తన భార్య సంగీతకు విడాకుల భరణంగా సుమారు రూ. 250 కోట్లు చెల్లించనున్నారనే వార్త కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత 27 ఏళ్లుగా కలిసి ఉన్న ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల ఓ వివాహ వేడుకలో నటి త్రిషతో కలిసి విజయ్ కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.

Thalapathy Vijay: విజయ్ - సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భరణం కింద భారీ మొత్తాన్ని విజయ్ ఆఫర్ చేసినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంలో విజయ్ కార్యాలయం నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 27 సంవత్సరాలు కలిసి జీవించిన విజయ్ - సంగీత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల పరిష్కారంగా సంగీత, వారి పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు విజయ్ మొత్తం రూ.250 కోట్లు ఇస్తారని చెబుతున్నారు. డబ్బుకు సంబంధించి చి ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేనప్పటికీ, వారిద్దరూ కేసును మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో క్లోజ్ చేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.

Thalapathy Vijay: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగీత విడాకుల పిటిషన్ కాపీల ప్రకారం, విజయ్ పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. విజయ్ ఒక నటితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని సంగీత ఆరోపించింది. ఆ నటి త్రిష అని చాలాసార్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఈ వార్తలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అయితే, తన పిటిషన్ లో ఈ విషయం తనకు 2021 ఏప్రిల్‌లో తెలిసినట్లు సంగీత చెప్పారు. అప్పట్లో నటితో సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. అయితే, విజయ్ హామీ నిలబెట్టుకోలేదు. ఆ సంబంధాన్ని కొనసాగించారని సంగీత ఆరోపించారు. దీనివల్ల తనకు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది కలిగిందని ఆమె పిటిషన్ లో పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి.

విజయ్ తో నటి బహిరంగంగా కనిపించడం, అతనితో ఫోటోలు షేర్ చేసుకోవడం తనకు, తన పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకూ ఈ ఆరోపణలపై ఎటువంటి నిరూపణ జరగలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా కోలీవుడ్ లో విజయ్ తన విడాకుల కోసం కోట్లాది రూపాయల భరణం ఇవ్వనున్నాడనే వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ ఇంకా రావాల్సి ఉంది.

దళపతి విజయ్ ఆగస్టు 25, 1999న సంగీతను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్ సినిమా దర్శకత్వంపై దృష్టి పెడుతున్నాడు. కుమార్తె దివ్య సాషా చదువుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories