OTT: ఫ్యామిలీ మ్యాన్‌ 3 కూడా వచ్చేస్తోంది.. ఈసారి దాడులు బాంబులతో కాదు

The Family Man 3
x

OTT: ఫ్యామిలీ మ్యాన్‌ 3 కూడా వచ్చేస్తోంది.. ఈసారి దాడులు బాంబులతో కాదు

Highlights

OTT: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.

OTT: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. రెండో సీజన్‌లో సమంత నెగిటివ్‌ రోల్‌లో నటించి అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఈ సిరీస్‌లో సామ్‌ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ నుంచిఇప్పుడు మూడో పార్ట్‌ చేస్తోంది.

అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రధాన నటుడు మనోజ్ బాజ్‌పేయి ఫ్యామిలీ మ్యాన్ 3 గురించి అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ విడుదల తేదీ గురించి వెల్లడించారు. మూడో సీజన్ ఈ ఏడాది నవంబర్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించారు.

రెండో సీజన్‌ ముగిసే సమయానికి మూడో సీజన్‌కు లింక్‌ ఇచ్చారు. బాంబులతో కాకుండా, ఈసారి శత్రువులు వైరస్‌ల ద్వారా దాడి చేయబోతున్నారని క్లూ ఇచ్చారు. మూడో భాగంలో కథ మరింత ఉత్కంఠగా ఉండబోతుందని సమాచారం. ఈ సీజన్‌లో మరో టాలెంటెడ్‌ నటుడు జాయిన్‌ అయ్యారు. పాతాళ్ లోక్‌ ఫేమ్ జైదీప్ అహ్లావత్ ఈసారి ఫ్యామిలీ మ్యాన్‌ యూనివర్స్‌లో కనిపించనున్నారు.

‘రెండు సంవత్సరాల కిందట ప్రదీప్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. అతను పాతాళ్ లోక్ సీజన్ 2లో అద్భుతంగా నటించాడు. ఇప్పుడు మా అదృష్టం కొద్దీ, అతను ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో కూడా చేరాడు. ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది’ అని మనోజ్ బాజ్‌పేయి తెలిపారు. మొదటి రెండు సీజన్లను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ద్వయం మూడో సీజన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే, ఇటీవల వీరు ‘ఫర్జీ’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉండటంతో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’కి ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్ పూర్తయిందని, నవంబర్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కి రాబోతోందని సమాచారం. ఈసారి కథ, క్యారెక్టర్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ మరింత గ్రిప్పింగ్‌గా ఉండనున్నాయని, అభిమానులు ఒక అద్భుతమైన అనుభవానికి సిద్ధంగా ఉండాలని టీమ్ హింట్‌ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories