డిసెంబర్ 25న బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) చిత్రం విడుదల

డిసెంబర్ 25న బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) చిత్రం విడుదల
x
Highlights

దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ, “‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ తరహాలో హిలేరియస్ సినిమాను అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన పాటలు ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘ఇలా చూసుకుంటానే’ పాటకు యూట్యూబ్‌లో 6 మిలియన్ వ్యూస్ రావడం ఆనందంగా ఉందన్నారు. టైటిల్ సాంగ్‌కూ మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. మిగిలిన పాటలు, టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories