The Raja Saab: ‘రాజాసాబ్’కి కొత్త ఊపు.. ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్లు యాడ్‌ – ఈ సాయంత్రం నుంచే థియేటర్లలో!

The Raja Saab: ‘రాజాసాబ్’కి కొత్త ఊపు.. ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్లు యాడ్‌ – ఈ సాయంత్రం నుంచే థియేటర్లలో!
x

The Raja Saab: ‘రాజాసాబ్’కి కొత్త ఊపు.. ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్లు యాడ్‌ – ఈ సాయంత్రం నుంచే థియేటర్లలో!

Highlights

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది.

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ, మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషనల్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ ‘ఓల్డ్ గెటప్’ సినిమా లో లేకపోవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, దర్శకుడు మారుతి స్పందించారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త సీన్స్‌లో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ తప్పకుండా ఉంటుందని తెలిపారు.

ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని, ల్యాగ్ అనిపించిన కొన్ని సన్నివేశాలను తొలగించి సినిమా మరింత షార్ప్‌గా మార్చినట్లు మారుతి చెప్పారు. ఈరోజు సాయంత్రం షోల నుంచే థియేటర్లలో ‘రియల్ రాజాసాబ్’ ను ప్రేక్షకులు చూడబోతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ..

“ట్రైలర్‌లో ఓల్డ్ గెటప్‌లో ప్రభాస్‌ను చూపించాం. ఆ లుక్ కోసం ఫ్యాన్స్ సినిమా మొత్తం ఎదురు చూశారు. ఆ డిజప్పాయింట్‌మెంట్ వల్ల కొంతమంది కథను పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. అందుకే అభిమానుల కోసం కొత్తగా సీన్స్ యాడ్ చేస్తున్నాం. ఈ 8–9 నిమిషాల ఎపిసోడ్ ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది” అని తెలిపారు.

ఇక సంక్రాంతి సీజన్‌లో విడుదలైన అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు మారుతి చెప్పారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో కొత్త కాన్సెప్ట్‌లో సినిమా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ తెలిపారు. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లలో ఈ హారర్ ఫాంటసీ మూవీని ఎంజాయ్ చేయాలని సూచించారు.

మొత్తానికి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాల యాడ్‌తో ‘ది రాజాసాబ్’ మరోసారి థియేటర్లలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగి, కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories