The Raja Saab Review : వణుకు పుట్టించే సీన్లు..కడుపుబ్బ నవ్వించే కామెడీ..మారుతి-ప్రభాస్ కాంబో సక్సెస్ అయిందా?

The Raja Saab Review : వణుకు పుట్టించే సీన్లు..కడుపుబ్బ నవ్వించే కామెడీ..మారుతి-ప్రభాస్ కాంబో సక్సెస్ అయిందా?
x
Highlights

The Raja Saab Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఫాంటసీ చిత్రం ది రాజా సాబ్ జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.

The Raja Saab Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఫాంటసీ చిత్రం ది రాజా సాబ్ జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. కల్కి 2898 AD వంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ రాజా సాబ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో చూద్దాం.

కథ :

రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్) ఒక సాధారణ యువకుడు. తన నానమ్మ గంగాదేవి (జరీనా వహాబ్) అంటే అతనికి ప్రాణం. అయితే గంగాదేవికి మతిమరుపు సమస్య ఉన్నప్పటికీ, తన భర్త కనకరాజు (సంజయ్ దత్) గురించి మాత్రం మర్చిపోదు. కనకరాజు ఒకప్పుడు దేవనగర సంస్థానానికి అధిపతి. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు తన ఆస్తిపై ఉన్న దురాశతో రాజమహల్‌లో ఏదో మాయాజాలం చేస్తుంటాడు. తన తాతను వెతకడానికి రాజాసాబ్ ఆ రాజమహల్‌లోకి అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎదురైన భయానక శక్తులు ఏంటి? కనకరాజు అసలు ప్లాన్ ఏంటి? తన నానమ్మను రాజాసాబ్ ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే?

ఫస్టాఫ్: సినిమా ప్రారంభం చాలా సరదాగా సాగిపోతుంది. మనం చాలా కాలంగా మిస్ అయిన ప్రభాస్ కామెడీ టైమింగ్‌ను మారుతి మళ్ళీ గుర్తుచేశారు. ప్రభాస్ ఎంట్రీ సీన్ సింపుల్‌గా ఉన్నా, ఆయన స్వాగ్ అభిమానులకు కిక్ ఇస్తుంది. రాజమహల్‌లోకి ప్రవేశించిన తర్వాత వచ్చే హారర్ సీన్స్, కామెడీ సీన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద ఇచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై భారీ అంచనాలను పెంచుతుంది.

సెకండాఫ్ :సెకండాఫ్‎లో కథ అసలు రంగు బయటపడుతుంది. ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ మధ్య మైండ్ గేమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా సంజయ్ దత్ తన భయానక నటనతో వెన్నులో వణుకు పుట్టిస్తారు. కొన్ని సన్నివేశాలు నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్ కి ముందు వచ్చే హాస్పిటల్ సీన్ మరియు ఇతర యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.

క్లైమాక్స్ : సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ చివరి 30 నిమిషాలు. మారుతి తన విజన్‌ను క్లైమాక్స్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఒక విజువల్ వండర్‌గా మార్చేశాయి. రాజా సాబ్ సర్కస్ అంటూ రెండో భాగానికి ఇచ్చిన లీడ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ప్యాకేజీ.

నటీనటుల పనితీరు:

ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన లుక్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుచేశారు. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ అదరగొట్టారు. ప్రభాస్ - సంజయ్ ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకు హైలైట్. మాళవిక మోహనన్ గ్లామర్, యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకోగా, నిధి అగర్వాల్ పాటల్లో మెరిశారు. రిద్ది కుమార్ పాత్ర పరిమితమే అయినా డీసెంట్ గా ఉంది. అలాగే సత్య, వీటీవీ గణేష్, సప్తగిరి అక్కడక్కడా నవ్వించారు. సముద్రఖని, బొమన్ ఇరానీ తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

మారుతి తన మార్క్ కామెడీని ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా బాగా బ్యాలెన్స్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్స్‌లో భయాన్ని, యాక్షన్ సీన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. కార్తీక్ పళని విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, ముఖ్యంగా రాజమహల్ సెటప్ అదిరిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ & స్టైలిష్ లుక్.

అదిరిపోయే క్లైమాక్స్ & VFX.

సంజయ్ దత్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు.

అక్కడక్కడా రొటీన్ గా అనిపించే కామెడీ ట్రాక్.

కథలో కొంత కొత్తదనం లోపించడం.

ఫైనల్లీ

ది రాజా సాబ్ అనేది ప్రభాస్ అభిమానులకు ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. సీరియస్ రోల్స్ లో చూసిన ప్రభాస్ ను మళ్ళీ సరదాగా, స్టైలిష్ గా చూడాలనుకునే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్. మారుతి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వాడుకున్నారు. కొన్ని లోపాలున్నా, ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ లో ఇది ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్!

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories