OTT: అందం శాపంగా మారిన యువతి కథ.. ఓటీటీలో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.

OTT: అందం శాపంగా మారిన యువతి కథ.. ఓటీటీలో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.
x

OTT: అందం శాపంగా మారిన యువతి కథ.. ఓటీటీలో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్.

Highlights

ఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ప్రేక్షకుల ఆద‌ర‌ణ భారీగా పెరుగుతోంది.

ఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ప్రేక్షకుల ఆద‌ర‌ణ భారీగా పెరుగుతోంది. భాష గానీ నటీనటులు గానీ అడ్డంకిగా లేకుండా, వినూత్నమైన కథలతో రూపొందుతున్న సిరీస్‌లను, సినిమాలను ప్రేక్షకులు ఆసక్తి చూస్తున్నారు. అలాంటి సిరీస్‌లలో ఒకటి.. కొరియన్‌ సస్పెన్స్‌ డ్రామా ‘ది విచ్ (The Witch)’. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) 10 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ క‌థ ఏంటి.? ఎలా ఉంది.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కథ నాయిక పేరు పార్క్ మి-జియోంగ్. బాహ్యంగా చూడ్డానికి చాలా అందమైన అమ్మాయి. కానీ ఆమె అందమే ఆమెకు శాపంగా మారుతుంది. హైస్కూల్ రోజుల నుంచే ఆమెను ప్రేమించే వారు గాయపడడం లేదా మరణించడం ప్రారంభమవుతుంది. ఈ విషయాలపై పుకార్లు వ్యాపించి.. ఆమెపై ‘శాపం ఉంది’ అనే అపోహలు సమాజంలో పెరుగుతాయి. చివరకు మి-జియోంగ్‌ను గ్రామస్థులు బయటకు పంపుతారు.

ఈ సంఘటనల తర్వాత ఆమె తన జీవితం పూర్తిగా ఒంటరితనంలో గడుపుతుంది. ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తూ, బయట ప్రపంచానికి దూరంగా జీవితం సాగిస్తుంటుంది. కానీ ఆమె కథ ఇక్కడితో ముగియదు. లీ డాంగ్-జిన్ అనే డేటా అనలిస్ట్ మి-జియోంగ్ పాత స్కూల్ ఫ్రెండ్. అతనికి అప్పటినుంచే ఆమెపై ఆసక్తి ఉంటుంది. పదేళ్ల తర్వాత యాదృచ్ఛికంగా ఆమెను మళ్లీ కలుస్తాడు. ఆమెపై ఉన్న పుకార్లను తప్పు అని నిరూపించాలనే తపనతో, లాజిక్, డేటాను ఆధారంగా తీసుకొని మి-జియోంగ్ జీవితంలో జరిగిన ఘటనలు విశ్లేషించటం ప్రారంభిస్తాడు.

జాగ్రత్తగా పరిశీలించేటప్పుడు డాంగ్-జిన్ మి-జియోంగ్ జీవితంలోని నిజాలను తెలుసుకుంటాడు. అదే సమయంలో జంగ్ హ్యోక్ అనే మరో వ్యక్తి కూడా ఇదే తరహా శాపం అనుభవించాడన్న విషయం తెలిడయ‌డంతో కథ మరింత మలుపుతిరుగుతుంది.

ఈ సిరీస్ చివర్లో వచ్చే ట్విస్ట్ నిజంగా ఊహించలేనిది. ఈ షాకింగ్ ఎలిమెంట్‌నే ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది. ఇంత‌కీ చివ‌రికి ఏమైంది.? లాంటి విష‌యాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories