Trisha : ఏంటి నా హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేస్తారా.. పెళ్లి వార్తలపై త్రిష ఘాటు స్పందన

Trisha
x

Trisha : ఏంటి నా హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేస్తారా.. పెళ్లి వార్తలపై త్రిష ఘాటు స్పందన

Highlights

Trisha : సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి త్రిష.

Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి త్రిష. మిస్ చెన్నై కిరీటం గెలిచి సినిమాల్లోకి వచ్చిన త్రిష, వరుస హిట్‌లతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, ఆమె కెరీర్ ఎంత విజయవంతమైందో, ఆమె పెళ్లి గురించి పుకార్లు కూడా అంతే తరచుగా వస్తూ ఉంటాయి. తాజాగా, చండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను త్రిష పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు రావడంతో, ఈ వదంతలపై ఆమె ఘాటుగా స్పందించారు.

కొంతకాలంగా త్రిష పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, ఆమె చండీగఢ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు విస్తృతంగా ప్రచారమైంది. ఈ వదంతలపై సాధారణంగా స్పందించని త్రిష, ఈసారి మాత్రం గట్టిగానే రియాక్ట్ అయ్యింది. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఘాటు సమాధానాన్ని పోస్ట్ చేసింది. "కొంతమంది నా జీవితం గురించి ప్లాన్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. వారు నా హనీమూన్‌ను కూడా ప్లాన్ చేయడం చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని సెటైర్ వేసింది. ఈ ఒక్క వాక్యంతో త్రిష తన పెళ్లి గురించి వస్తున్న అన్ని వదంతీలకు ముగింపు పలికినట్లు అయింది.

2000 సంవత్సరంలో మిస్ చెన్నై టైటిల్‌ను గెలుచుకున్న త్రిష, అప్పటి నుంచి ప్రకటనలలో మోడల్‌గా పనిచేసి, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఆమె తమిళ సినీ పరిశ్రమలో ప్రధాన నాయికగా కొనసాగుతూ, అనేక హిట్‌ చిత్రాలను అందించింది. తెలుగులోనూ ఆమెకు అశేష అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె సూర్యతో కలిసి కరుప్పు అనే తమిళ చిత్రంలో, అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర వంటి భారీ చిత్రంలో నటిస్తున్నారు.

త్రిష వివాహ విషయం 2014 లో వార్తల్లో నిలిచింది. 2014 లో ఆమె నిర్మాత వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల వారిద్దరి పెళ్లి జరగలేదు. దీనికి గల కారణాలను త్రిష ఎప్పుడూ వివరించలేదు. ఈ సంఘటన తర్వాత కూడా ఆమె పెళ్లి గురించి వదంతులు వస్తూనే ఉన్నాయి.

త్రిష చివరిసారిగా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రంలో కనిపించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు శింబు, అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి వంటి ప్రముఖ నటీనటులు నటించారు. కమల్ హాసన్, మణిరత్నం చాలా ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి, అయితే సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories