నేడు మహానటి సావిత్రి వర్ధంతి

నేడు మహానటి సావిత్రి వర్ధంతి
x
Highlights

ఈ రోజు (డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు, అభిమానుల చేత మహానటిగా గొప్ప కీర్తిని పొందిన సావిత్రి వర్ధంతి.

ఈ రోజు (డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు, అభిమానుల చేత మహానటిగా గొప్ప కీర్తిని పొందిన సావిత్రి వర్ధంతి. అలనాటి అందాల సినీ తార సావిత్రిని తెలుగు వారితో పాటు తమిళనాడు వారు కూడా ఎంతో ప్రేమతో, గౌరవంతో ఆదరించారు.తన నటనా కౌశల్యం, మంచి మనసుతో తెలుగువారి గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.

సేవామూర్తి, నిస్వార్థపరురాలు, ఉన్న ఆస్తులన్నింటిని దానం చేసిన దాత సావిత్రికి నివాళులు. అతి మంచితనం, అతి దానగుణం కూడా మంచిది కాదు అన్న నీతి పాఠాన్ని ఆమె ప్రజలకు బోధించి పిన్న వయసులోనే తనువు చాలించారు. మాయాబజార్, గుండమ్మ కథ, దేవదాసు, మిస్సమ్మ, రక్త సంబంధం... వంటి చిత్రాలలో తన నటనతో తెలుగువారి మనసంతా నిండిపోయారు.

ఆమె అందం అద్దంలో లేదు, ప్రేక్షకుల గుండెల్లో ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంది, కఠినమైన జీవితానికి భయపడలేదు. మోసపోయేంత అమాయకత్వం ఆమె బలహీనత కాదు,అది ఆమె స్వచ్ఛత. నవ్వితే వెండి తెర వెలిగేది, ఏడిస్తే హాలంతా నిశ్శబ్దమయ్యేది. పాత్రల్లో ఆమె నటించలేదు, పాత్రలే ఆమెగా మారిపోయాయి. విజయాన్ని తలపై పెట్టుకోలేదు, అపజయాన్ని గుండెల్లో దాచుకుంది. మరణం ఆమె జీవనాన్ని ఆపింది గానీ, మహానటిగా ఆమె ప్రయాణాన్ని కాదు.

ఎన్టీఆర్ సావిత్రి హిట్ పెయిర్ గా పేరుపొందారు. ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ లో 41 సినిమాలు వచ్చాయి. వీటిలో 32 సినిమాలు 100 రోజులు ఆదాయి. గుండమ్మ కథ, శ్రీ వేంకటేశ్వర మహత్యం ఇండస్ట్రీ హిట్స్. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు ఒక సభలో మాట్లాడుతూ, ‘‘బాపు రమణలు చెప్పినట్లు... ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు... అలాగే ఒకే సావిత్రి... ఈ సినిమా ప్రపంచానికి’’ అని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories