Nikhil: ఆ వీడియోలపై స్పందించిన నిఖిల్‌.. ఏమన్నారంటే?

Tollywood actor nikhil siddharth responds about leaked video in mastan sai case
x

Nikhil: ఆ వీడియోలపై స్పందించిన నిఖిల్‌.. ఏమన్నారంటే?

Highlights

మస్తాన్‌ సాయి హార్డ్‌ డిస్క్‌లో నిఖిల్‌ ప్రైవేట్‌ వీడియోలు కూడా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

మస్తాన్‌ సాయి పేరు ఇటీవల సంచలనంగా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య, మస్తాన్ సాయి‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లావణ్య తన ఫిర్యాదులో మస్తాన్ సాయి అకృత్యాల గురించి పోలీసులకు వివరించారు. అతనికి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను కూడా అందించింది.

ఆ హార్డ్‌ డిస్క్‌లో 200కి పైగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, ఆడియో కాల్స్ ఉన్నాయని బాధితురాలు ఆరోపించారు. ఈ వివరాలు బయటకు రావడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది. మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీశాడని లావణ్య తన ఫిర్యాదులో తెలిపారు. బాధితులను మోసం చేసి వీడియోలు డిలీట్ చేసినట్లు నటించేవాడు. కానీ వాటిని హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లలో స్టోర్ చేసేవాడని లావణ్య ఆరోపించారు. ఇక డబ్బులు ఇవ్వనివారిని లైంగికంగా వాడుకుని రహస్యంగా మరిన్ని వీడియోలు తీసేవాడు అని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది.

నిఖిల్‌ ప్రస్తావన..Nikhil: ఆ వీడియోలపై స్పందించిన నిఖిల్‌.. ఏమన్నారంటే?

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోకి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పేరు కూడా రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మస్తాన్‌ సాయి హార్డ్‌ డిస్క్‌లో నిఖిల్‌ ప్రైవేట్‌ వీడియోలు కూడా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై హీరో నిఖిల్‌ స్పందించారు. తనపై జరుగుతోంది తప్పుడు ప్రచారమని తెలిపాడు. కార్తికేయ 2 సక్సెస్‌ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీకి సంబంధించిన వీడియోలను కొన్ని వ్యక్తులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఉన్నవారు నా కుటుంబ సభ్యులే. పోలీసులకు వాస్తవం తెలుసు అని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories