Tollywood: తరాలు మారుతున్నా, కొత్త హీరోలు వస్తున్నా.. టాలీవుడ్ లెజెండ్స్ క్రేజ్ మాత్రం తగ్గేదేలే!

Tollywood: తరాలు మారుతున్నా, కొత్త హీరోలు వస్తున్నా.. టాలీవుడ్ లెజెండ్స్ క్రేజ్ మాత్రం తగ్గేదేలే!
x

Tollywood: తరాలు మారుతున్నా, కొత్త హీరోలు వస్తున్నా.. టాలీవుడ్ లెజెండ్స్ క్రేజ్ మాత్రం తగ్గేదేలే!

Highlights

తెలుగు సినీ పరిశ్రమలో తరాలు మారుతున్నా, కాలం వేగంగా పరుగులు తీస్తున్నా.. కొందరు లెజెండ్స్ మాత్రం ఎప్పటికీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు. ఆ స్టార్స్ మరెవరో కాదు..

తెలుగు సినీ పరిశ్రమలో తరాలు మారుతున్నా, కాలం వేగంగా పరుగులు తీస్తున్నా.. కొందరు లెజెండ్స్ మాత్రం ఎప్పటికీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ.. ఇప్పుడు కొత్తతరం దర్శకులతో కలిసి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అప్పటి ఆరాతో పాటు న్యూ ఏజ్ ఆలోచనలను మేళవిస్తూ.. టాలీవుడ్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ ఫోర్ పిల్లర్స్.

చిరంజీవి:

ఓల్డ్ స్కూల్ మాస్ ఆరాను ఇప్పటికీ అలాగే నిలుపుకుంటూ.. న్యూ ఏజ్ ఇంటెంట్‌తో ముందుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల, బాబీ వంటి దర్శకులతో కలిసి మాస్ సినిమాలకు కొత్త అర్థం చెబుతున్న చిరు.. కథ, పాత్ర, ప్రెజెంటేషన్‌లో ఎలాంటి రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. తరాలు మారినా క్రేజ్ మాత్రం ఇంతకూడా చెక్కుచెదరలేదని బాస్ మరోసారి నిరూపిస్తున్నారు. ఇటీవలే 'మన శంకర వరప్రసాద్ గారు'తో భారీ హిట్ కొట్టారు.

బాలకృష్ణ:

నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్, పవర్ ఫుల్ యాక్షన్. ఇప్పుడు కూడా వాటినే ఆధునిక టచ్‌తో మేళవిస్తూ మరో లెవల్‌కు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఆపై తమిళ దర్శకుడితో కలిసి బాలయ్య కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. రా ట్రడిషన్‌కు కాంటెంపరరీ ఫైర్ జతచేస్తూ.. ‘అన్‌స్టాపబుల్’గా తన ఊపు కొనసాగిస్తున్నారు బాలయ్య బాబు. అఖండ 2తో ప్రేక్షకులను పలకరించారు.

వెంకటేష్:

కాలానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. ప్రతి దశలోనూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే హీరో వెంకటేష్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘AK47’తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరో సినిమా కూడా పైప్‌లైన్‌లో ఉండగా.. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ్రేస్‌ఫుల్ రీఇన్వెన్షన్ అంటే ఏంటో వెంకీ మామ మరోసారి చూపించబోతున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం'తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ.. 'మన శంకర వరప్రసాద్ గారు'లో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.

నాగార్జున:

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు మారుతూ.. కొత్త కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ‘కింగ్100’ దిశగా అడుగులు వేస్తూ.. ఆర్.ఏ. కార్తిక్‌తో కలిసి ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా పాత్రల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ నాగ్ తన ఎవాల్యూషన్‌ను కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూస్తే తరాలు మారుతున్నా, కొత్త హీరోలు వస్తున్నా.. ఈ టాలీవుడ్ లెజెండ్స్ మాత్రం ఇంకా కమాండ్‌లోనే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories