Trisha: అవునా.. త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిందా.? వైరల్‌ అవుతోన్న ఫొటోలు

Trisha
x

Trisha: అవునా.. త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిందా.? వైరల్‌ అవుతోన్న ఫొటోలు

Highlights

Trisha: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు 20 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటోందీ హీరోయిన్‌ త్రిష. 40 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.

Trisha: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు 20 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటోందీ హీరోయిన్‌ త్రిష. 40 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఇక నిత్యం సినిమాలతో బిజీగా ఉండే త్రిష్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా త్రిష వివాహానికి సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వస్తుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా త్రిష్‌ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. దీనికి కారణం, ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు. ఆకుపచ్చ చీరలో మెరిసిపోతూ, మ్యాచింగ్ నెక్లెస్‌, ఉంగరం ధరించి త్రిష పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలకు "ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది" అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ ఫొటోలు వైరల్ కావడంతో త్రిష పెళ్లి చేసుకోబోతోందా? ఎంగేజ్‌మెంట్ అయిందా? అంటూ అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. త్రిష ముఖంలో పెళ్లికళ కనిపిస్తోందని, త్వరలో పెళ్లి వార్త బయటకు వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై త్రిష్‌ కానీ ఆమె టీమ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇక కెరీర్ విషయానికొస్తే , త్రిష ఈ ఏడాది రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించింది. మళయాలంలో వచ్చిన ‘ఐడెంటిటీ’ సస్పెన్స్ థ్రిల్లర్‌గా హిట్ అయ్యింది. అజిత్‌తో కలిసి నటించిన ‘విదాముయార్చి’ (తెలుగులో ‘పట్టుదల’) కూడా భారీ వసూళ్లు రాబట్టింది. త్రిష ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’, అజిత్ హీరోగా నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, సూర్య 45, మోహన్ లాల్ ‘రామ్’ సినిమాల్లో నటిస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories