Trisha Krishnan : ఆ పుకార్లు చూస్తే అసహ్యం వేస్తుంది.. త్రిష సంచలన కామెంట్స్

Trisha Krishnan : ఆ పుకార్లు చూస్తే అసహ్యం వేస్తుంది.. త్రిష సంచలన కామెంట్స్
x

Trisha Krishnan : ఆ పుకార్లు చూస్తే అసహ్యం వేస్తుంది.. త్రిష సంచలన కామెంట్స్

Highlights

సుమారు 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు త్రిష. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన ఈ అందాల తార..

Trisha Krishnan : సుమారు 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు త్రిష. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన ఈ అందాల తార.. 42 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే గత కొంత కాలంగా తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, తప్పుడు కథనాలపై త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన గురించి అబద్ధాలు రాసే వారిని చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ త్రిష చేసిన కామెంట్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్‌కు అంత కోపం ఎందుకు వచ్చిందో చూద్దాం.

గత కొన్ని రోజులుగా, త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై త్రిష తన సహనాన్ని కోల్పోయింది. "నేను ఎవరితోనైనా ఫోటో దిగితే, వెంటనే నన్ను వారికి ఇచ్చి పెళ్లి చేసేస్తారా? నన్ను ఇంకా ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేస్తారు? నేను నా స్నేహితులతో దిగిన ఫోటోలను చూపిస్తూ పెళ్లి వార్తలు రాస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వారిని చూస్తే నాకు నిజంగా అసహ్యం వేస్తుంది" అంటూ త్రిష తన కోపాన్ని వెళ్లగక్కింది. అంతేకాకుండా దయచేసి ఈ తప్పుడు వార్తలు రాయడం ఆపండి అని ఆమె విజ్ఞప్తి చేసింది.

త్రిష ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఆమె పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే, వ్యక్తిగత జీవితంలో ఎన్ని పుకార్లు వచ్చినా, త్రిష మాత్రం తన కెరీర్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం త్రిష, మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర అనే భారీ బడ్జెట్ (సుమారు రూ.150 కోట్లు) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో కూడా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. త్రిష సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ, కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

త్రిష తెలుగు, తమిళంతో పాటు కన్నడలో కూడా ఒకే ఒక సినిమా చేసింది. అది దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ సరసన చేసిన పవర్. పునీత్‌తో కలిసి త్రిష ద్విత్వ అనే మరో కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పునీత్ ఆకస్మిక మరణం తరువాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గతంలో కూడా తన పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు త్రిష చాలాసార్లు వాటిని ఖండించింది. అయినప్పటికీ పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. తన ప్రైవసీని గౌరవించాలని త్రిష ఈ సందర్భంగా కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories