Disha Patani : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై దాడి.. ఇద్దరు ఎన్‌కౌంటర్!

Disha Patani : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై దాడి.. ఇద్దరు ఎన్‌కౌంటర్!
x

Disha Patani : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై దాడి.. ఇద్దరు ఎన్‌కౌంటర్!

Highlights

బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి పై ఇటీవల కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బుధవారం (సెప్టెంబర్ 17) ఘజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో గాయపడిన ఇద్దరు నిందితులు చనిపోయారు. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ఎన్‌కౌంటర్‌ను నిర్వహించారు. చనిపోయిన వారిని అరుణ్ , రవీంద్రగా గుర్తించారు. వీరు రోహిత్ గోదారా, బోల్డీ బ్రార్ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉన్నారు.

Disha Patani : బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి పై ఇటీవల కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బుధవారం (సెప్టెంబర్ 17) ఘజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో గాయపడిన ఇద్దరు నిందితులు చనిపోయారు. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ఎన్‌కౌంటర్‌ను నిర్వహించారు. చనిపోయిన వారిని అరుణ్ , రవీంద్రగా గుర్తించారు. వీరు రోహిత్ గోదారా, బోల్డీ బ్రార్ గ్యాంగ్‌తో సంబంధం కలిగి ఉన్నారు.

కాల్పులకు కారణం ఇదే

దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ సనాతన ధర్మం, సన్యాసుల పట్ల అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 12న తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

సీసీటీవీ ఫుటేజీలు, ఇంటెలిజెన్స్ సమాచారం వంటి ఆధారాలను బట్టి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సహకారంతో ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. గాయపడిన ఇద్దరు నిందితులను ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారు చనిపోయారు.

గ్యాంగ్ వార్తపై స్పందన

నిందితుల నుంచి పిస్టోల్ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రవీంద్ర గతంలో కూడా పలు నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న మరికొంతమందిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది. దిశా పటానీ ఇంటిపై జరిగిన కాల్పుల బాధ్యతను రోహిత్ గోదారా, బోల్డీ బ్రార్ గ్యాంగ్ తీసుకున్నారు.

ఈ దాడి తర్వాత దాడి చేసిన వారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, అది వైరల్ అయింది. "భవిష్యత్తులో ఎవరైనా మన సనాతన ధర్మం సన్యాసులను అవమానిస్తే, దాని పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మన ధర్మాన్ని రక్షించడానికి మేము ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories