Hyderabad: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు.. దిల్‌రాజుకు సన్మానం

Hyderabad
x

Hyderabad: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు.. దిల్‌రాజుకు సన్మానం

Highlights

Hyderabad: హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఉగాది వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.

Hyderabad: హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఉగాది వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి కేశిరెడ్డి శివారెడ్డి, ఖజానాదారు జూజాల శైలజ, కార్యవర్గ సభ్యులు కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ. గోపాలరావు, అదనపు ఛైర్మన్ సురేష్ కొండేటి, సభ్యులు పద్మజ, శివ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు విజయవంతంగా జరిగాయి.

ఈ సందర్భంగా తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేఎల్ నారాయణ, మాజీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె. వేంకటేశ్వరరావు, ఎఫ్ఎన్‌సీసీ గత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు మాట్లాడుతూ, ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అలాగే, నిర్మాత దిల్ రాజును సత్కరించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆయన చిన్న, పెద్ద సినిమాలను నిర్మిస్తూ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. థియేటర్ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో దిల్ రాజు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ఎఫ్‌ఎన్‌సీసీ క్లబ్ తనకు అత్యంత ప్రియమైనదని, 1996లో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి 30 ఏళ్లలో క్లబ్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేఎల్ నారాయణ, కేఎస్ రామారావు, వారి కమిటీ చేసిన కృషిని అభినందించారు. లీజు పొడగింపు విషయం చిన్నదేనని, త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారని, 200 ఎకరాల ఫిల్మ్ సిటీ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతానని చెప్పారు.

ఇక ఉగాది పండుగ సందర్భంగా బ్రహ్మశ్రీ సురేష్ శర్మ పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన నాయర్ సిస్టర్స్ 'విష్ణువైభవం' భరతనాట్యం ప్రదర్శించగా, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం 'విశ్వనాధామృతం' కూచిపూడి నృత్యంతో మెప్పించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories