Upcoming Movies:ఈ వారం థియేటర్, ఓటీటీ చిత్రాలివే..!

Upcoming telugu Movies March Second Week
x

ఈ వారం థియేటర్, ఓటీటీ చిత్రాలివే..!

Highlights

ఈ వారం ప్రేక్షకులకు వినోదాల విందుకు పంచడానికి సరికొత్త చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. తెలుగుతో పాటు హిందీ సినిమాలు అలరించబోతున్నాయి. అటు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Upcoming Movies: ఈ వారం ప్రేక్షకులకు వినోదాల విందుకు పంచడానికి సరికొత్త చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. తెలుగుతో పాటు హిందీ సినిమాలు అలరించబోతున్నాయి. అటు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నాని నిర్మాతగా రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కోర్టు. ఎంటర్‌టైన్ తో పాటు భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయంటోంది చిత్రబృందం. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది.

కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు విశ్వకరుణ్ తెరకెక్కించిన చిత్రం దిల్ రూబా. ఈ సినిమాలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. అయితే ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 14న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి.. అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థ్యాంక్స్‌కి నా దృష్టిలో విలువ లేదు అంటూ ప్రచార చిత్రంలో కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. కున్‌చకో బొబన్, ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రమిది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అదే పేరుతో మార్చి 7న తెలుగులో విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నకిలీ బంగారు ఆభరణాల కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా హరిశంకర్ అనే పోలీసు అధికారి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు..? అన్న కథ ఆధారంగా దీనిని రూపొందించారు.

జాన్ అబ్రహం కీలక పాత్రలో శివమ్ నాయర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ ది డిప్లోమాట్. సాదియా, కుముద్ మిశ్రా, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ నిజ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తీ, సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన చిత్రం యుగానికి ఒక్కడు. ఈ సినిమాలో ఆండ్రియా, రీమా సేన్ కథానాయికలుగా నటించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. మార్చి 14న మరోసారి తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

ఇక ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించనున్నాయి.

సోనీలివ్‌ అఖిల్ నటించిన ఏజెంట్ మార్చి 14న అలరించనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అమెరికన్ మ్యాన్ హంట్ (డాక్యుమెంటరీ సిరీస్) మార్చి 10 రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో వీల్ ఆఫ్ టైమ్ 3 (వెబ్ సిరీస్) మార్చి 13, బీ హ్యాపీ (హిందీ) మార్చి 14 రానుంది. జీ5లో ఇన్ గలియోంమే (హిందీ) మార్చి 14 ప్రేక్షకులను అలరించనుంది. ఆపిల్ టీవీ ప్లస్: డోప్‌థీప్ (వెబ్ సిరీస్) మార్చి 14న రానుంది. ఈటీవీ విన్: మార్చి 13న పరాక్రమం (తెలుగు), రామం, రాఘవం మార్చి 14న రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories