Tollywood Re-Releases: రీ రిలీజ్ ట్రెండ్‌.. థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైన పాత సినిమాలు

Tollywood Re-Releases
x

Tollywood Re-Releases: రీ రిలీజ్ ట్రెండ్‌.. థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైన పాత సినిమాలు

Highlights

Tollywood Re-Releases: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ప్రేక్ష‌ల‌ను ఆక‌ట్టుకున్న సినిమాలు ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో ప‌ల‌క‌రిస్తున్నాయి. ప్రేక్ష‌కుల‌ను సైతం ఈ సినిమాల‌కు క్యూ క‌డుతున్నారు.

Tollywood Re-Releases: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ప్రేక్ష‌ల‌ను ఆక‌ట్టుకున్న సినిమాలు ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో ప‌ల‌క‌రిస్తున్నాయి. ప్రేక్ష‌కుల‌ను సైతం ఈ సినిమాల‌కు క్యూ క‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పెద్ద‌గా కొత్త సినిమాలేవి లేక‌పోవ‌డంతో పెద్ద ఎత్తున రీరిలీజ్‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. రొమాన్స్, మాస్, ఎమోషన్, యాక్షన్ అనే అన్ని ఎలిమెంట్లు కలిగిన ఆరు సినిమాలు రీ-ఎంట్రీకి రెడీ అయ్యాయి. ఇంత‌కీ ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గజిని

సూర్య కెరీర్‌లో ఓ ఆల్ టైమ్ హై యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన చిత్రం గజిని. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూలై 18న తెలుగు ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేయనుంది.

కుమారి 21F

యువతను ఆలోచింపజేసే ఈ ప్రేమ కథ సుకుమార్ రచనలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చింది. రాజ్ తరుణ్, హెబా పటేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం జూలై 10న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది స్వేచ్ఛ, అపోహల మధ్య ప్రేమ ఎలా మారుతుందన్న కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించారు.

హనుమాన్ జంక్షన్

2001లో వచ్చిన ఈ మల్టీస్టారర్ డ్రామా ప్రేక్షకులను తెగ నవ్వించింది. అర్జున్, జగపతిబాబు, వేణు కలిసి స్క్రీన్‌పై చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జూన్ 28న మళ్లీ థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది.

మిరపకాయ్

రవితేజ అభిమానులకు మంచి వార్త. "మిరపకాయ్" మూవీ జూలై 11న మళ్లీ రిలీజ్ అవుతోంది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ మహారాజా మళ్లీ ఈ సినిమాలో న‌టించిన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి తమన్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్.

ఏ మాయ చేశావే

స‌మంత, నాగ చైత‌న్య జంట‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాతోనే చై, సామ్‌ల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని చెబుతుంటారు. అయితే ఇప్పుడీ సినిమా మ‌ళ్లీ జూలై 18న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

వీడొక్కడే

సూర్య, తమన్నా జంటగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. ‘ఆయాన్’ మూవీకి ఇది తెలుగు వెర్షన్. సైంటిఫిక్ స్మగ్లింగ్ కథాంశంతో కూడిన ఈ చిత్రం రీ-రిలీజ్‌తో ఫ్యాన్స్‌ను మళ్లీ థ్రిల్ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories