Cannes 2025: రెడ్ కార్పెట్‌పై త‌ళుక్కుమ‌న్న అందాల ఊర్వశి.. కానీ ఊహించ‌ని సంఘ‌ట‌న

Cannes 2025, Urvashi Rautela
x

Cannes 2025: రెడ్ కార్పెట్‌పై త‌ళుక్కుమ‌న్న అందాల ఊర్వశి.. కానీ ఊహించ‌ని సంఘ‌ట‌న

Highlights

Cannes 2025, Urvashi Rautela: బాలీవుడ్ నటి ఉర్వశి రౌటెలా ఈ సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండోసారి రెడ్ కార్పెట్‌పై కనిపించింది.

Cannes 2025, Urvashi Rautela: బాలీవుడ్ నటి ఉర్వశి రౌటెలా ఈ సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండోసారి రెడ్ కార్పెట్‌పై కనిపించింది. ఆమె ధరించిన నలుపు రంగు గౌన్ ఎంతగానో ఆకట్టుకుంది. సోష‌ల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని ఓ సంఘ‌ట‌న ఎదురైంది.




దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆమె కెమెరాకు హాయ్ చెప్పే సమయంలో, ఆమె గౌన్ పైభాగంలో (భుజం వద్ద) ఓ చిన్న రంధ్రం కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేయడం ప్రారంభించారు.

అంత పెద్ద ఈవెంట్‌లో హీరోయిన్ ధ‌రించే విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా.? అస‌లు ఆ డిజైన‌ర్ ఎవ‌రు అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం అంత అందంగా ఉన్న డ్ర‌స్‌లో ఆ చిన్న త‌ప్పును ప‌ట్టుకోవ‌డం ఎంటంటూ మ‌రికొంద‌రు మ‌ద్ధ‌తుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఫ‌స్ట్ అప్పియ‌రెన్స్‌లో రంగురంగు గౌన్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఊర్వ‌శి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ స‌మ‌యంలో ఆమె చేతిలో ఉన్న ఓ క్ల‌చ్ (పౌచ్‌) అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ క్లచ్‌ను Judith Leiber అనే బ్రాండ్ రూపొందించింది. దీని ధర సుమారుగా రూ. 4.68 లక్షలు.



Show Full Article
Print Article
Next Story
More Stories