Pawan Kalyan: పవర్‌స్టార్ పవనిజం.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి..!

Pawan Kalyan: పవర్‌స్టార్ పవనిజం.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి..!
Ustaad Bhagat Singh Release Date Out: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.
Ustaad Bhagat Singh Release Date Out: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఉగాది పండగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ పవన్ కల్యాణ్ పవర్ఫుల్ లుక్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. పవన్ కల్యాణ్ పొలిటికల్ బిజీలో ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం కృషి చేస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



