Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ 'ఆరా' షురూ.. సెకండ్ సింగిల్ ప్రోమోతో రచ్చ లేపుతున్న పవన్ కళ్యాణ్!

Ustaad Bhagat Singh
x

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ 'ఆరా' షురూ.. సెకండ్ సింగిల్ ప్రోమోతో రచ్చ లేపుతున్న పవన్ కళ్యాణ్!

Highlights

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, హరీష్ శంకర్ మేకింగ్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ఈ సాంగ్ అప్‌డేట్ మరియు మూవీ రిలీజ్ వివరాలు ఇక్కడ చూడండి.

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అంటూ సాగే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.



దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మాస్ బీట్

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ అందించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఎస్.పి. అభిషేక్ తో కలిసి డిఎస్పీ ఈ పాటను ఆలపించారు. కేవలం ప్రోమోతోనే సాంగ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ పాట పూర్తి వెర్షన్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మార్చి 26న గ్రాండ్ రిలీజ్

అనేక వాయిదాల తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు మరియు 'OG' షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమాను పట్టాలెక్కించారు. గతంలో 'భవదీయుడు భగత్ సింగ్'గా అనుకున్న ఈ ప్రాజెక్ట్, కొన్ని మార్పుల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'గా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచిన చిత్ర యూనిట్, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

గతంలో వచ్చిన టీజర్ సృష్టించిన హైప్, ఇప్పుడు ఈ పాటతో మరో స్థాయికి చేరుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు కాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories