Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కాలర్ ఎయ్ ఎత్తరా’ ప్రోమో ఈరోజే

Pawan Kalyan Ustaad Bhagat Singh
x

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కాలర్ ఎయ్ ఎత్తరా’ ప్రోమో ఈరోజే

Highlights

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ‘కాలర్ ఎయ్ ఎత్తరా’ సాంగ్ ప్రోమో ఈరోజు విడుదల కానుంది. పూర్తి పాట మార్చి 12న రిలీజ్ చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవల చిత్రబృందం ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ప్రకటించింది. “కాలర్ ఎయ్ ఎత్తరా” అనే టైటిల్‌తో విడుదల కానున్న ఈ పాటకు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ అందించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ ద్వారా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ పాటకు సంబంధించిన పవర్‌ఫుల్ ప్రోమోను ఈ రోజు సాయంత్రం 4:36 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పూర్తి పాటను మార్చి 12, 2026న విడుదల చేయనున్నారు. ఈ పాట విడుదల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories