Ustaad Bhagat Singh Update: పవన్ కల్యాణ్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్‌ సంబరాలు మొదలయ్యాయి!

Ustaad Bhagat Singh Update: పవన్ కల్యాణ్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్‌ సంబరాలు మొదలయ్యాయి!
x

Ustaad Bhagat Singh Update: పవన్ కల్యాణ్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్‌ సంబరాలు మొదలయ్యాయి!

Highlights

‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇప్పుడు మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇప్పుడు మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘గబ్బర్ సింగ్’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ రావడం వల్ల ఫ్యాన్స్‌లో క్రేజ్ మరింత పెరిగింది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్‌కు జోడీగా రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరి తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.

ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదలకు రెడీ!

రెండురోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న పుకార్లకు మేకర్స్ నేనే క్లారిటీ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది—

‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని ఫస్ట్ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 9 సాయంత్రం 6:30కు విడుదల చేస్తున్నట్టు.

అదే సమయంలో ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ అప్డేట్‌తో పాటు పవన్ కల్యాణ్ బ్లాక్ కలర్ స్టైలిష్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ధూమం రేపుతోంది. పవన్ లుక్ సింపుల్‌గా, స్టైలిష్‌గా, ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకునేలా ఉంది.

DSP కామెంట్స్‌తో మరింత హైప్

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) ముందే తెలిపాడు. ఆ మాటలతో ఫ్యాన్స్‌లో సినిమా కోసం మరింత క్రేజ్ పెరిగింది.


ఫస్ట్ సింగిల్ ప్రోమో అనౌన్స్‌మెంట్‌తో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రాబోయే రోజుల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మరిన్ని అప్డేట్స్ దుమ్మురేపే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories