Vaishnavi Chaitanya: కొలీవుడ్‌లో మరో తెలుగమ్మాయికి ఛాన్స్.. చిన్న పాత్ర నుంచి హీరోయిన్‌గా గ్రేట్ జర్నీ!

Vaishnavi Chaitanya
x

Vaishnavi Chaitanya: కొలీవుడ్‌లో మరో తెలుగమ్మాయికి ఛాన్స్.. చిన్న పాత్ర నుంచి హీరోయిన్‌గా గ్రేట్ జర్నీ!

Highlights

Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌తో మొదలైన ఆమె జర్నీ.. హీరోయిన్ వరకు చేరింది.

Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌తో మొదలైన ఆమె జర్నీ.. హీరోయిన్ వరకు చేరింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడంతో టచ్ చేసి చూడు, అల వైకుంఠపురములో, రంగ్‌దే, టక్‌ జగదీశ్‌, వరుడు కావలెను సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిశారు. ఇక ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన 'బేబి' సినిమాతో హీరోయిన్‌గా బిగ్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్‌ దేవరకొండతో మరో సినిమా చేస్తున్నారు.

ఇక వైష్ణవి చైతన్య ఇప్పుడు తమిళ చిత్రసీమలో అడుగుపెడుతూ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. 2022లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ చిన్న అవకాశం ఆమెకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఇండస్ట్రీలో వైష్ణవికి పెద్ద అవకాశమే దక్కింది. నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రంలో వైష్ణవి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. వైష్ణవికి తమిళంలో హీరోయిన్‌గా తొలి సినిమా ఇదే కానుంది.

చిన్న పాత్రతో మొదలైన వైష్ణవి చైతన్య ప్రయాణం ఇప్పుడు కథానాయిక స్థాయికి చేరడం ఆమె కృషి, పట్టుదలకి నిదర్శనం అని సినీ వర్గాలు అంటున్నాయి. వైష్ణవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌతిండియన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు. విషయం తెలిసిన ఫాన్స్ సోషల్ మీడియా వైష్ణవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక చిన్న పాత్ర నుంచి లీడ్ రోల్ వరకు ఎదగడం నిజంగా ప్రేరణాత్మకమైన ప్రయాణమని, ఆమె భవిష్యత్‌లో మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకోవాలని కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories