
Varalaxmi Sarathkumar : అది కేవలం ఇన్నర్ వేర్ మాత్రమే.. ఎందుకంత గోల?..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Varalaxmi Sarathkumar : నటి, దర్శకురాలు వరలక్ష్మీ శరత్‌కుమార్ మహిళల డ్రెస్సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "బ్రా స్ట్రాప్ కనిపిస్తే అంత గోల ఎందుకు?" అంటూ సమాజపు తీరును ఎండగట్టారు.
Varalaxmi Bold Comments : వెండితెరపై తన నటనతో, గంభీరమైన గొంతుతో మెప్పించే వరలక్ష్మీ శరత్‌కుమార్, ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో ప్రియమణి, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సరస్వతి’. మార్చి 6న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్ల హోరు పెంచిన వరలక్ష్మి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచం నుంచి సోషల్ మీడియా వరకు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
డ్రెస్సింగ్‌పై విమర్శలకు వరలక్ష్మి స్ట్రాంగ్ కౌంటర్
సాధారణంగా మహిళలు వేసుకునే దుస్తుల వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని కొందరు పురుషులు చేసే వాదనపై యాంకర్ ప్రశ్నించగా.. వరలక్ష్మి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఆమె అడిగిన ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.మీ ఇంట్లో మీ చెల్లి పొట్టి గౌను (Short Skirt) వేసుకుని వెళ్తే.. ఆమెను రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? అనిపించదు కదా. మరి బయట అమ్మాయి విషయంలో ఆ వికృత ఆలోచన ఎందుకు వస్తుంది?" అని సూటిగా ప్రశ్నించారు.
అది కేవలం ఇన్నర్ వేర్ మాత్రమే.. ఎందుకంత గోల?
దుస్తుల విషయంలో సమాజం పాటించే ప్రమాణాలను (Double Standards) ఆమె ఎండగట్టారు. మగాళ్ల డ్రెస్సింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం మగవారు వేసుకునే జీన్స్ ప్యాంట్లు ఎంత లో-వేస్ట్‌గా ఉంటున్నాయో అందరికీ తెలుసు. వంగితే లోపల ఏం ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. అలా అని మేము వెళ్లి వాళ్ల మీద పడిపోవడం లేదు కదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా మహిళల లోదుస్తుల విషయంలో జరిగే బాడీ షేమింగ్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. అందరూ ఇన్నర్ వేర్ వేసుకుంటారు. మగాళ్ల లోదుస్తులు బయటకు కనిపిస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ, ఒక అమ్మాయి బ్రా స్ట్రాప్ (Bra Strap) కొంచెం బయటకు కనిపిస్తే చాలు.. ఏదో కొంపలు మునిగిపోయినట్లు, ఆమె క్యారెక్టర్ మొత్తం పోయినట్లు గోల గోల చేస్తారు. అందులో ఏముంది? అది కేవలం ఒక లోదుస్తు మాత్రమే కదా! ఎందుకు అంతగా జడ్జ్ చేస్తారు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్..
"ఎవరి బాడీ వారి ఇష్టం.. ఎవరి డ్రెస్సింగ్ వారి ఇష్టం. ఇంటి దగ్గర అమ్మ, చెల్లి విషయంలో లేని చెడు ఆలోచనలు.. బయట అమ్మాయిని చూడగానే ఎందుకు వస్తాయి?" అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు ఆమె బోల్డ్ స్టేట్మెంట్ను సమర్థిస్తుంటే, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.ఏది ఏమైనా, 'సరస్వతి' సినిమా విడుదలకు ముందు వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, సమాజంలోని మూఢాచారాలపై ఒక చర్చకు తెరలేపాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




