Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 2 కాదు?


Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 2 కాదు?
Vijay Deverakonda-Rashmika Wedding: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పేర్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Vijay Deverakonda-Rashmika Wedding: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పేర్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ఈ టాలీవుడ్ స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేయడమే ఇందుకు కారణం. ఫిబ్రవరి 2న రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని ఈరోజు ఉదయం న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరో డేట్ అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం… విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్యే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఉదయ్‌పూర్‌లోని హెరిటేజ్ ప్రాపర్టీని పెళ్లి వేడుక కోసం బుక్ చేసినట్లు టాక్. రిసెప్షన్‌కి సంబంధించి డేట్, వెన్యూ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ వార్త నిజమైతే.. టాలీవుడ్లో ఈ ఏడాది అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలవనుంది. ఫిబ్రవరి 2నే పెళ్లి అయితే టాలీవుడ్లో కొందరికైనా ఇన్విటేషన్ వెళ్లేదని, ఇంకా విజయ్ ఎవరినీ కలవలేదని నెటిజెన్స్ అంటున్నారు. ఫిబ్రవరి 26నే పెళ్లి అంటూ పోస్టులు పెడుతున్నారు.
గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ, పెళ్లి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరి మధ్య బంధం గురించి పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ ఊహాగానాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో విజయ్, రష్మికలు ఉంగరాలు మార్చుకున్నట్లు కూడా న్యూస్ వచ్చింది.నిశ్చితార్థం, పెళ్లి డేట్ అంటూ వార్తలు వస్తున్నా.. అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమేనా? లేక మరోసారి వైరల్ రూమరా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వస్తే మాత్రం విజయ్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



