Vijay Deverakonda & Rashmika: విజయ్ దేవరకొండ ఇంట దగ్గర మొదలైన హ‌డావిడి..పెళ్లి ప‌నులు షురూ

Vijay Deverakonda & Rashmika: విజయ్ దేవరకొండ ఇంట దగ్గర మొదలైన హ‌డావిడి..పెళ్లి ప‌నులు షురూ
x
Highlights

Vijay Deverakonda & Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. విజయ్-రష్మిక పెళ్లి ఎప్పుడు?. అటు విజయ్ దేవరకొండ గానీ, ఇటు రష్మిక మందన్న గానీ ఎప్పుడూ తమ ప్రేమ విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

Vijay Deverakonda & Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. విజయ్-రష్మిక పెళ్లి ఎప్పుడు?. అటు విజయ్ దేవరకొండ గానీ, ఇటు రష్మిక మందన్న గానీ ఎప్పుడూ తమ ప్రేమ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, 'గీత గోవిందం' నాటి నుండి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం ఆగలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం ఖరారైందని టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఒక చారిత్రాత్మక ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకను అత్యంత గోప్యంగా, కేవలం అతికొద్ది మంది సన్నిహితులు,కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించబోతున్నారట. పెళ్లికి వచ్చే అతిథులు ఫోటోలు తీయకూడదని ఇప్పటికే నో ఫోన్ పాలసీ కండిషన్స్ కూడా పెట్టినట్లు సమాచారం.

పెళ్లి రహస్యంగా చేసుకున్నా, టాలీవుడ్ మిత్రుల కోసం మరియు అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఒక భారీ రిసెప్షన్ ప్లాన్ చేశారట. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర తారలందరూ హాజరుకాబోతున్నారు.

ప్రస్తుతానికి ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే అయినప్పటికీ, పెళ్లి ఏర్పాట్లు మాత్రం చకచకా జరుగుతున్నాయట. మా మధ్య స్నేహం తప్ప ఇంకేం లేదు అని చెప్పే ఈ జంట, ఒక్కసారిగా పెళ్లి కార్డుతో షాక్ ఇవ్వబోతున్నారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, 2026 టాలీవుడ్ బిగ్గెస్ట్ వెడ్డింగ్‌గా ఇది నిలిచిపోవడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories