Vijay Deverakonda : ఆ గుణాలు నాలో లేవు.. గర్ల్‌ఫ్రెండ్‌ రష్మికపై మనసు విప్పి మాట్లాడిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda : ఆ గుణాలు నాలో లేవు.. గర్ల్‌ఫ్రెండ్‌ రష్మికపై మనసు విప్పి మాట్లాడిన విజయ్ దేవరకొండ
x

 Vijay Deverakonda : ఆ గుణాలు నాలో లేవు.. గర్ల్‌ఫ్రెండ్‌ రష్మికపై మనసు విప్పి మాట్లాడిన విజయ్ దేవరకొండ

Highlights

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న మధ్య ఉన్న ప్రేమాయణం ఇప్పుడు సినీ ప్రపంచంలో బహిరంగ రహస్యమే.

Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న మధ్య ఉన్న ప్రేమాయణం ఇప్పుడు సినీ ప్రపంచంలో బహిరంగ రహస్యమే. ఇద్దరూ నేరుగా అంగీకరించకపోయినా, పరోక్షంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూనే ఉన్నారు. గత వారం విడుదలైన రష్మిక తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ... తన గర్ల్‌ఫ్రెండ్ రష్మిక పై పొగడ్తల వర్షం కురిపించారు.

రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ, తనతో రష్మికకు ఉన్న అనుబంధం, ఆమె వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడారు. గీత గోవిందం సినిమా సమయంలో రష్మిక యువతిగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆమె చాలా బాధ్యతాయుతమైన మహిళగా మారిందని విజయ్ అన్నారు.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో రష్మిక పోషించిన భూమ పాత్రకు, నిజ జీవితంలో ఆమె వ్యక్తిత్వానికి చాలా పోలిక ఉందని విజయ్ తెలిపారు. రష్మిక ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వ్యక్తులు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని, సెట్‌లో కూడా అందరూ సంతోషంగా ఉండాలని, ఎవరికీ బాధ కలగకూడదని తాపత్రయ పడుతుందని అన్నారు. ఇతరుల కోసం, తనకు కష్టం కలిగినా సరే త్యాగం చేస్తుందని, ఇతరులకు తన వల్ల ఎలాంటి ఇబ్బంది, బాధ కలగకూడదనేది ఆమె ప్రధాన ఆశయం అని విజయ్ వివరించారు.

రష్మికలో ఉన్న గొప్ప గుణాలలో ఒకటి, తనపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడం అని విజయ్ అన్నారు. "నన్ను ఎవరైనా నెగిటివ్‌గా మాట్లాడినా, బాధ పెట్టినా నేను వెంటనే వారికి తిరిగి జవాబు ఇస్తాను. కానీ రష్మిక మాత్రం ఎప్పుడూ అలా చేయదు. ప్రపంచం మొత్తం తనను విమర్శించినా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూనే ముందుకు సాగుతుంది" అని విజయ్ తెలిపారు.

బాధ పెట్టిన వారికి కూడా ఆమె మంచి జరగాలని కోరుకుంటుందని, తన పనిపై మాత్రమే దృష్టి పెడుతుందని విజయ్ పేర్కొన్నారు. సెట్‌లో కూడా ఏ కష్టమైన పని అప్పగించినా, ఎంత కఠినమైన నియమాలు ఉన్నా వాటిని పాటిస్తుందని విజయ్ రష్మిక వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. విజయ్ ప్రశంసలకు రష్మిక కూడా ప్రేమతో స్పందించింది. "ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి నువ్వు ఇందులో భాగమయ్యావు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్‌లో కూడా నువ్వు భాగమయ్యావు. నా జీవిత ప్రయాణంలో నువ్వు ఉన్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయి ఉండాలి" అని రష్మిక పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఉండడం ఒక ఆశీర్వాదంలా అనిపిస్తుందని ఆమె ప్రేమగా చెప్పారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మధ్యనే ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే విజయ్, రష్మిక వివాహం కూడా చేసుకోబోతున్నారట. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుందని సినీ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories