విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? థియేటర్లలో మిక్స్‌డ్ టాక్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? థియేటర్లలో మిక్స్‌డ్ టాక్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
x

Vijay Deverakonda's 'Kingdom' OTT Release Date Revealed: Mixed Response in Theatres, Streaming Details Inside

Highlights

విజయ్ దేవరకొండ తాజా సినిమా 'కింగ్డమ్' థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ పొందింది. తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ వివరాలు, కథాసారాంశం, నటీనటుల సమాచారం తెలుసుకోండి.

కింగ్‌డమ్ ఓటీటీలోకి వస్తోంది.. విజయ్ దేవరకొండ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు మిక్స్‌డ్ టాక్!

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ ఈ నెల జూలై 31న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.

దర్శకత్వం, సంగీతం, నిర్మాణ విలువలు

‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంగీతాన్ని కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది.

థియేటర్లలో మిక్స్‌డ్ టాక్.. కానీ కలెక్షన్లు ఓకే

సినిమా విజువల్స్‌, రియలిస్టిక్ లొకేషన్లు, సినిమాటోగ్రఫీపై మంచి కామెంట్లు వచ్చినప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం, ఎమోషనల్ కానెక్ట్ కొరత కారణంగా కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, తొలి రోజున రూ.39 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు.

ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌దే! స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?

కింగ్‌డమ్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అందుకే, థియేటర్ రన్ పూర్తయ్యాక, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా టాక్, బాక్సాఫీస్ రన్‌ను బట్టి చూస్తే, ఓటీటీలో నాలుగు వారాల తర్వాత, అంటే ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ ప్రారంభంలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.

కథ ఏంటి?

ఈ కథలో, కానిస్టేబుల్ సూరి, తన అన్న శివ కోసం వెతుకుతుంటాడు. శివ శ్రీలంకలో ఓ ప్రమాదకర మాఫియా గూడు లో ఉంటున్నాడని తెలిసిన సూరి, స్పైగా వెళ్లి అన్నను రక్షించే మిషన్‌లో ఎంటరవుతాడు. ఈ సాహసయాత్రలో ఎదురయ్యే సవాళ్లే కథా సారాంశం.

Show Full Article
Print Article
Next Story
More Stories