Viplava Veerudu Movie Launch: స్వాతంత్ర్య సమరయోధుల గాథతో ‘విప్లవ వీరుడు’ షురూ.. కీలక పాత్రలో నటి ఇంద్రజ!

Viplava Veerudu Movie Launch: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన స్ఫూర్తిదాయక చరిత్రను వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం...
Viplava Veerudu Movie Launch: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన స్ఫూర్తిదాయక చరిత్రను వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు ఎస్. నాగరాజ్ రావు. జైశ్వర్, సోనాలి జంటగా ఏవీ జయరాం నిర్మిస్తున్న 'విప్లవ వీరుడు' చిత్రం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
రాణి భవానిదేవిగా ఇంద్రజ
ఈ చిత్రంలో నటి ఇంద్రజ ‘రాణి భవానిదేవి’ అనే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిని సామాన్య ప్రజలు ఏ విధంగా ఎదిరించారో ఈ సినిమాలో సహజంగా చూపించబోతున్నామని, అర్థవంతమైన కథతో వస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
టిప్పు సుల్తాన్ కాలం నాటి కథాంశం
సినిమా నేపథ్యం గురించి నిర్మాత ఏవీ జయరాం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా టిప్పు సుల్తాన్ కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశంలోకి ప్రవేశించి, ఇక్కడి సంపదను ఎలా దోచుకున్నారనే అంశాలను సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
నటీనటుల మాటల్లో..
హీరో జైశ్వర్ ఈ పాత్ర తన కెరీర్లో నిలిచిపోతుందని భావిస్తుండగా, హీరోయిన్ సోనాలికి ఇది తొలి చిత్రం. దర్శకుడు నాగరాజు రావు మాట్లాడుతూ, చారిత్రక అంశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. నటుడు పటేల్ అశోక్ రెడ్డి ఆనాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకునేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. గ్రాండ్ విజువల్స్ మరియు చారిత్రక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



