Vishnu Vinyasam Review : విష్ణు విన్యాసం రివ్యూ: శ్రీవిష్ణు మరో విన్యాసం చేశాడా? లేక తడబడ్డాడా?

Vishnu Vinyasam Review : విష్ణు విన్యాసం రివ్యూ: శ్రీవిష్ణు మరో విన్యాసం చేశాడా? లేక తడబడ్డాడా?
x

Vishnu Vinyasam Review : విష్ణు విన్యాసం రివ్యూ: శ్రీవిష్ణు మరో విన్యాసం చేశాడా? లేక తడబడ్డాడా?

Highlights

కామెడీ టైమింగ్‌తో శ్రీ విష్ణు అదరగొట్టాడు.. రొటీన్ స్టోరీని కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌గా మార్చిన ‘విష్ణు విన్యాసం’!

Vishnu Vinyasam Review : టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. వరుసగా మూడు కమర్షియల్ హిట్‌లు అందుకున్న తర్వాత, ఆయన నటించిన తాజా చిత్రం విష్ణు విన్యాసం. డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా, నేడు థియేటర్లలో విడుదలైంది. ఆయ్ సినిమాతో మెప్పించిన నయన సారిక ఇందులో కథానాయికగా నటించగా, రాధన్ సంగీతం అందించారు. ట్రైలర్, టీజర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా, నేడు థియేటర్లలో విడుదలైంది. మరి శ్రీవిష్ణు తన సక్సెస్ రూట్‌ను కొనసాగించాడా? ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే:

విష్ణు (శ్రీవిష్ణు) ఒక కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అదే కాలేజీలో మనీషా (నయన సారిక) హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వహిస్తుంటుంది. మనీషా ప్రవర్తన కొంచెం వింతగా, విలక్షణంగా ఉంటుంది. ఆమెలోని ఆ ప్రత్యేక లక్షణాలే విష్ణును ఆకర్షిస్తాయి. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న సమయంలో, మనీషా తన జాతకంలో ఉన్న ఒక పెద్ద దోషం గురించి విష్ణుకు చెబుతుంది. అసలు ఆ జాతక దోషం ఏమిటి? ఆ దోషం వల్ల విష్ణు పెళ్లికి ఎందుకు వెనకడుగు వేశాడు? వీరిద్దరి మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుని చివరికి ఎలా ఒకటయ్యారు అన్నదే ఈ సినిమా అసలు కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను భుజాలపై మోశాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా పండింది. అయితే మరికొన్ని చోట్ల కాస్త అతిగా అనిపించినా, వినోదాన్ని అందించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. నయన సారికకు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఆమె తన నటనతో మెప్పించడమే కాకుండా, స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది. ఇక కమెడియన్ సత్య పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. శ్రీవిష్ణు, సత్య కాంబినేషన్‌లో వచ్చే సీన్లు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి తమ పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు ఉన్నప్పటికీ, వారి పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం కొంచెం నిరాశ కలిగిస్తుంది.

సాంకేతిక వర్గం

సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదకరంగా ఉంది. అయితే సంగీతం విషయంలో రాధన్ మెప్పించలేకపోయాడు. పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సాదాసీదాగానే ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కొన్ని సాగదీసిన సీన్లను కత్తిరించి ఉంటే బాపం ఉండేది. దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఎంచుకున్న కథాంశం బాగున్నా, కథనంలో ఇంకొంచెం పదును పెంచాల్సింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను చాలా వేగంగా, ఊహించిన విధంగా ముగించడం మైనస్ అనే చెప్పాలి.

విశ్లేషణ

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ ప్రారంభమైన కాసేపటికే సినిమా పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాల లోటు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం కామెడీని నమ్ముకుని దర్శకుడు సినిమాను లాగించే ప్రయత్నం చేశాడు. పాత సినిమాల్లోని కొన్ని పాత్రల ఛాయలు ఇందులో కనిపిస్తాయి, దీనివల్ల కొత్తదనం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, వీకెండ్‌లో సరదాగా నవ్వుకోవాలి అనుకునే వారికి విష్ణు విన్యాసం ఒక ఓకే అనిపించే ఛాయిస్. శ్రీవిష్ణు ఫ్యాన్స్‌కు, కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories