
VK Naresh: చీరెలు కట్టుకొని వచ్చారు.. హగ్ చేసుకొను..కానీ అంటూ
VK Naresh: టాలీవుడ్‌లో ఇటీవల నటుడు శివాజీ చేసిన 'డ్రెస్సింగ్' వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, ఇప్పుడు అదే అంశాన్ని తనదైన స్టైల్లో సరదాగా మలిచి అందరినీ నవ్వించారు సీనియర్ నటుడు వీకే నరేష్.
VK Naresh: టాలీవుడ్‌లో ఇటీవల నటుడు శివాజీ చేసిన 'డ్రెస్సింగ్' వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, ఇప్పుడు అదే అంశాన్ని తనదైన స్టైల్లో సరదాగా మలిచి అందరినీ నవ్వించారు సీనియర్ నటుడు వీకే నరేష్.
యంగ్ హీరో సుహాస్ నటించిన ‘హే భగవాన్’ చిత్ర ప్రెస్ మీట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శివాజీ కామెంట్స్ తర్వాత ఇండస్ట్రీలో మారుతున్న వాతావరణాన్ని ఆయన ఫన్నీగా వెటకరిస్తూనే, పాజిటివ్‌గా ఈవెంట్‌ను రక్తికట్టించారు.
వరల్డ్ హగ్ డే సందర్భంగా వేదికపై ఉన్న వారందరికీ హగ్ ఇస్తూ వచ్చిన నరేష్, హీరోయిన్ల దగ్గరకు వచ్చేసరికి సడన్‌గా ఆగారు. అక్కడ ఉన్న శివానీ నాగారం, యాంకర్ స్రవంతిలను ఉద్దేశించి.. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేసుకోవాలని ఉంది. కానీ, ఆ సంఘటన తర్వాత స్టేజ్ మీద అందరూ చీరలే కట్టుకుంటున్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం మనకు హగ్ వద్దు.. మీరిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకోండి అంటూ సెటైర్ వేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
యాంకర్ గీతా భగత్‌ను కూడా ఆయన వదల్లేదు. నీ కట్టుబొట్టు చూస్తుంటే అది కూడా భారతీయ సంస్కృతి కేటగిరీ కిందకే వస్తుంది. అందుకే దూరం నుంచే హ్యాపీ హగ్ డే చెబుతున్నాను అన్నారు. అంతటితో ఆగకుండా, ఈ ఈవెంట్ రేపు పెట్టుంటే ఇంకా బాగుండేది. ఈరోజు హగ్ డే, రేపు కిస్ డే ఏదేమైనా మన సంస్కృతి, సంస్కారం ముఖ్యం కాబట్టి ఎవరికి వారు విష్ చేసుకుందాం అంటూ నరేష్ తనదైన శైలిలో ఫన్ క్రియేట్ చేశారు.
వివాదాస్పద అంశాన్ని కూడా వినోదభరితంగా మార్చడంలో నరేష్ తన సీనియారిటీని చూపించారు. సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన ‘హే భగవాన్’ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. యాంకర్ స్రవంతి ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




