Bigg Boss 9: 11వ వారం ఓటింగ్ ట్రెండ్స్.. 75% ఓట్లతో టాప్ 3 సేఫ్.. డేంజర్ జోన్‌లో దివ్య నిఖితా

Bigg Boss 9: 11వ వారం ఓటింగ్ ట్రెండ్స్.. 75% ఓట్లతో టాప్ 3 సేఫ్.. డేంజర్ జోన్‌లో దివ్య నిఖితా
x
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇంకో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుండటంతో ఇంట్లో ఉత్కంఠ, ఎమోషన్స్ రెండూ పీక్‌కి చేరాయి.

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇంకో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుండటంతో ఇంట్లో ఉత్కంఠ, ఎమోషన్స్ రెండూ పీక్‌కి చేరాయి. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ సందడి కొనసాగుతుండగా 74వ రోజు సెంటిమెంట్‌తో పాటు హైడ్రామాతో నిండిపోయింది. వరుసగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చి తమ ఫేవరెట్స్‌కి మద్దతు ఇవ్వడంతో పాటు, ఇంటి డైనమిక్స్‌ని పూర్తిగా మార్చేశారు. 11వ వారం నామినేషన్స్ టెన్షన్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తుండడంతో బీబీ హౌస్ ఎమోషన్స్‌కు కేరాఫ్‌గా మారింది.

74వ రోజు మొదటగా కళ్యాణ్ తల్లి లక్ష్మి హౌస్‌లోకి వచ్చి అందరిలోనూ పాజిటివ్ వైబ్‌ను నింపారు. ఈ సందర్భంగా తనూజ ఆమెకు చీర గిఫ్ట్‌గా ఇవ్వడంపై కళ్యాణ్ ప్రశ్నించగా, తనూజ ఫ్యామిలీ మెంబర్‌లా భావించి ఇచ్చాను, వేరే ఉద్దేశం లేదు అని స్పష్టం చేసింది. అయితే, భరణి.. తనూజ కాలుకి మసాజ్ చేయడాన్ని చూసిన దివ్య అసహనం వ్యక్తం చేసింది. తనూజ అవసరానికి తగ్గట్టు మనుషుల్ని వాడుకుంటుంది, అలాంటి వాళ్లంటే నాకు చిరాకు అని దివ్య, భరణికి చెప్పి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత రీతూ తల్లి వచ్చి ఇక నాలుగు వారాలే ఉన్నాయి, గట్టిగా ఆడాలి అంటూ రీతూకి ఎనర్జీ ఇచ్చారు.

ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా భరణి చిన్న కూతురు హారతి ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని హత్తుకుని ఆమె ఎమోషనల్ అయింది. హారతి.. తనూజను చూసి మీరు నాన్నతో ఉన్న బాండింగ్ మా ఫేవరెట్. నాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు చూసుకున్నావు, థ్యాంక్స్ అని చెప్పింది. అలాగే దివ్యకు నాన్నతో కమాండింగ్‌గా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. దీనికి దివ్య కూడా ఇకపై అలా బిహేవ్ చేయను అంటూ మాటిచ్చింది. హౌస్ నుంచి వెళ్లే ముందు హారతి తన తండ్రికి ఇచ్చిన సలహా అందరినీ ఆశ్చర్యపరిచింది.. నిన్ను కమాండ్ చేసే వాళ్ల దగ్గర సాఫ్ట్‌గా ఉండొద్దు.. ఫైర్ చూపించు అని చెప్పింది. మొత్తానికి ఫ్యామిలీ వీక్ కారణంగా ఇంటి డైనమిక్స్‌లో కొత్త మలుపులు కనిపించాయి.

ఇక 11వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే, కెప్టెన్ తనూజ స్పెషల్ పవర్‌తో రీతూను సేవ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్.. కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా.

ఆన్‌లైన్ ట్రెండ్స్ ప్రకారం ఈ వారం ఓటింగ్ ప్యాటర్న్స్ విషయానికి వస్తే.. కళ్యాణ్ పడాల (32.72%), ఇమ్మాన్యుయేల్ (26.65%), భరణి శంకర్ (15.69%) ఓట్లతో టాప్ 3 స్థానాల్లో నిలిచి సేఫ్‌గా ఉన్నారు. టాప్ 3 కంటెస్టెంట్లు మొత్తం ఓట్లలో 75% ఆక్రమించారు. డెమోన్ పవన్ (9.47%), సంజనా గల్రానీ (8.94%), దివ్య నిఖితా (6.53%) డేంజర్ జోన్‌లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దివ్య నిఖితా పరిస్థితి అత్యంత ప్రతికూలంగా ఉంది. అయితే శుక్రవారం రాత్రి 11:59 వరకు ఓటింగ్ కొనసాగుతుండడంతో చివరి నిమిషంలో ఓటింగ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎపిసోడ్‌ల ప్రభావం కూడా ఈ ఓటింగ్‌ను మార్చగలదని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories