Toxic Tabaahi Song: షర్ట్‌లెస్, బిగి కౌగిలిలో హీరోయిన్.. యష్ బోల్డ్ పోస్టర్, ముహుర్తం ఫిక్స్!

Toxic Tabaahi Song: షర్ట్‌లెస్, బిగి కౌగిలిలో హీరోయిన్.. యష్ బోల్డ్ పోస్టర్, ముహుర్తం ఫిక్స్!
x

Toxic Tabaahi Song: షర్ట్‌లెస్, బిగి కౌగిలిలో హీరోయిన్.. యష్ బోల్డ్ పోస్టర్, ముహుర్తం ఫిక్స్!

Highlights

Toxic Tabaahi Song: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహీ’ సాంగ్‌కు కౌంట్‌డౌన్.. యష్ బోల్డ్ లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్'. ‘ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనేది ఉప శీర్షిక. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాక్సిక్ రిలీజ్‌కు కొద్ది వారాలే మిగిలి ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది.

టాక్సిక్ సినిమా నుంచి మొదటి పాట విడుదలకు తేదీ ఖరారైంది. ‘తబాహి’ అనే టైటిల్‌తో వస్తున్న ఫస్ట్ సింగిల్‌ను మార్చి 2న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. యష్, హీరోయిన్ కియారా అద్వానీలు తబాహి సింగిల్‌కు సంబంధించిన పోస్టర్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో యష్ షర్ట్‌లెస్ లుక్‌లో కనిపిస్తుండగా.. కియారా అద్వానీ ఆయనను కౌగిలించుకున్న రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకుంటోంది.

మొదటి నుంచి టాక్సిక్ ప్రమోషన్లలో మేకర్స్ తగ్గేదేలే అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో బోల్డ్ సీన్లు, టీజర్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ఇందులో ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా.. హ్యుమా ఖురేషీ ఎలిజిబెత్‌గా, నయనతార గంగగా, రెబెకాగా తారా సుతారియాగా, మెలిసాగా రుక్మిణి వసంత్‌ అలరించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన అందరి ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు మంచి ఆదరణ లభించింది.

చిన్నారుల కోసం ఇప్పటికే ఎన్నో కథలు తెరకెక్కాయని, ఇది పెద్దలకు సందేశమిచ్చే సినిమా అని యష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ‘కేజీఎఫ్’ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ స్టార్ కాస్ట్, హై బడ్జెట్, యాక్షన్ ఎలిమెంట్స్.. అన్ని కలిపి ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఎలా మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories