YouTube: అలాంటి థంబ్‌నెయిల్స్ పెడితే అంతే సంగతులు.. యూట్యూబ్ కీలక నిర్ణయం

YouTube: అలాంటి థంబ్‌నెయిల్స్ పెడితే అంతే సంగతులు.. యూట్యూబ్ కీలక నిర్ణయం
x
Highlights

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ కోట్లాది కొత్త...

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ కోట్లాది కొత్త వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. ఇక యూట్యూబ్‌ సైతం యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అటు వీక్షకులతో పాటు క్రియేటర్లకు మేలు చేసే విధంగా యూట్యూబ్‌ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది.

ఇక యూట్యూబ్‌ ద్వారా ఎంతో మంది క్రియేటర్లు దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్‌ ద్వారా లక్షలు సంపాదిస్తోన్న వారు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే యూజర్లను అట్రాక్ట్ చేసే క్రమంలో క్రియేటర్లు ఉపయోగించే విధానంలో థంబ్‌నెయిల్స్‌ ప్రధానమైంది. రకరకాల థంబ్‌నెయిల్స్‌ పెట్టి అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ఇంట్రెస్టింగ్ థంబ్‌నెయిల్స్‌తో పాటు తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్‌ కూడా ఇటీవల ఎక్కువవుతున్నాయి. దీంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.

కంటెంట్‌కి వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్‌ పెడితే యూట్యూబ్‌ అకౌంట్లను తొలగించనున్నట్లు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది. ఎలాగైనా వ్యూస్‌ పొందాలనే ఉద్దేశంతో పక్కదారి పట్టించే టైటిల్స్‌ పెట్టే వారిని ఉపేక్షించిలేదని యూట్యూబ్ తెలిపింది. టైటిల్‌లో ఒక అర్థం ఉండి, లోపల కంటెంట్‌లో మరో అర్థం ఉండేలా ఎక్కువ మంది క్రియేటర్లు వీడియోలను రూపొందిస్తున్నారు.

ఈ విషయంలో యూట్యూబ్‌ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ఇక‌పై తప్పుదోవ పట్టించే క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్‌తో పాటు టైటిల్ ద్వారా యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ అకౌంట్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఇందుకోసం యూట్యూబ్ ఛానల్స్‌కు తగిన సమయం ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత కూడా యూట్యూబ్ ఛానళ్ల తీరు మారకపోయినా, నిబంధనలు పాటించకపోయినా ఛానల్‌ను టర్మినేట్‌ చేస్తామని తెలిపారు. మరి యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం క్రియేటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories