logo
జాతీయం

Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

13,313 New Corona Cases in India | Telugu News
X

Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

Corona Cases in India: తాజాగా 13, 313 కరోనా కేసులు నమోదు

Corona Cases in India: దేశంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. రోజు వారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. తాజాగా 13 వేల 313 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇటు కరోనా వల్ల 38 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 83 వేల 990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 2.30 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 33 లక్షల 44 వేల 958కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 196.62 కోట్ల టీకాలను పంపిణీ చేశారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

Web Title13,313 New Corona Cases in India | Telugu News
Next Story