లక్కీ బాయ్.. రూ.201 టికెట్‌తో రూ. 53 లక్షల ఫార్చ్యూనర్ కారు గెలుచుకున్న 4 ఏళ్ల చిన్నారి

లక్కీ బాయ్.. రూ.201 టికెట్‌తో రూ. 53 లక్షల ఫార్చ్యూనర్ కారు గెలుచుకున్న 4 ఏళ్ల చిన్నారి
x

లక్కీ బాయ్.. రూ.201 టికెట్‌తో రూ. 53 లక్షల ఫార్చ్యూనర్ కారు గెలుచుకున్న 4 ఏళ్ల చిన్నారి

Highlights

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం!

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం! మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పుర్ జిల్లా, సిలంపుర గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి మేధాంశ్‌కు ఊహించని అదృష్టం వరించింది. కేవలం ₹201 పెట్టి కొన్న లాటరీ టికెట్‌తో ఏకంగా రూ.53 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్‌ కారు తగిలింది.

స్థానికంగా జరిగిన గర్భా ఉత్సవాల సందర్భంగా శ్రీ సర్కార్‌ ధామ్‌ నిర్వహించిన లాటరీలో మేధాంశ్‌ పేరుపై అతడి తాత కిరణ్‌ రాయ్‌కర్‌ ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఫలితం రాగానే, విషయం తెలుసుకున్న సిలంపుర గ్రామస్తులు ఆశ్చర్యపోయి, మేధాంశ్‌ను "లక్కీ బాయ్‌" అంటూ ప్రశంసిస్తున్నారు. చిన్నారి జీవితాన్ని మలుపు తిప్పిన ఈ అదృష్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories