India’s Biggest Tragedy – భారతదేశపు అతిపెద్ద విషాదానికి 59 Years | దేశాన్ని కుదిపేసిన చారిత్రక ఘటన

x
Highlights

భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనకు 59 ఏళ్లు పూర్తయ్యాయి. దేశాన్ని కుదిపేసిన ఆ దుర్ఘటన వివరాలు, ప్రభావం మరియు చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోండి.

ఒకప్పుడు కలకలలాడిన పట్టణం నేడు నిర్మానుష్యమైన సిధిలాల కుప్ప ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ధనుష్కోడి కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు లాగవు. 25 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డ అలలు ఒక రైలును ఏ విధంగా తుడిచి పెట్టేసిందో తెలిస్తే ఒల్లు గగ్గురుపాటుకు గురవుతుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 59 ఏళ్ల క్రితం సరిగ్గా డిసెంబర్ 22న సంభవించిన పెను తుఫాన్ ఒక నిండు పట్టణాన్ని స్మశానంగా చేసింది. ఆ రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ భారతీయుల మదిలో చెదరని గాయంగా మిగిలింది. నిమిషాల్లోనే అంతం 1964 డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11:55 నిమిషాలకు పాంబర్ నుంచి ధనుష్కోడికి ప్ాసంజర్ రైలు బయలుదేరింది. అందులో 110 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మరికొద్ది సేపట్లో రైలు ధనుష్కోడు చేరుకుంటుంది అనగా 240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు 25 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డ అలలు రైలును చుట్టుముట్టాయి. లోకో పైలట్ తేరుకునేలోపే రైలు పట్టాలు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయట పడలేదు. రైలు ఆచూకి కూడా దొరకలేదంటే ఆ ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. సిధిలాల మధ్య చరిత్ర ఆ తుఫాన్ దాటికి కేవలం రైలు మాత్రమే కాదు ధనుష్కోడి పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రైల్వే స్టేషన్, ఆసుపత్రి, చర్చ్, పాఠశాలలు కుప్పకూలిపోయాయి. క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబైన చర్చ్ సిధిలావస్థకు చేరుకుంది. నాటి ప్రమాదానికి సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ కొన్ని గోడలు మాత్రమే మిగిలిన్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన అధికారులు రైలును అనుమతించడం పెద్ద తప్పిదం. ఒకప్పుడు శ్రీలంకకు ఫెర్రీ సర్వీస్లతో రద్దిగా ఉండే ధనుష్కోటి ఇప్పుడు ఒక ఘోస్ట్ టౌన్ నిర్మాణష్య ప్రాంతంగా మిగిలింది. రాత్రి వేళల్లో అక్కడ ఉండటానికి స్థానికులు భయపడతారు. పగటిపూట దుకానాలు నడుపుకునే వారు కూడా సాయంత్రం కాగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఆనాటి తుఫాను గుర్తులు నేటికి పర్యాటకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories