Tennis Player Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్‌‌ని హత్య చేసింది.. ఆ మ్యూజిక్ వీడియో కోసమేనా?

Tennis Player Radhika Yadav
x

Tennis Player Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్‌‌ని హత్య చేసింది.. ఆ మ్యూజిక్ వీడియో కోసమేనా?

Highlights

Tennis Player Radhika Yadav: ఇటీవల గురుగ్రామ్‌లో కన్న తండ్రే టెన్నిల్ ప్లేయిరైన రాధిక యాదవ్‌ని తుపాకీతో కాల్చి చంపేసాడు. అయితే ఈ కేసులో నిందుతుడు దీపక్ యాదవ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Tennis Player Radhika Yadav: ఇటీవల గురుగ్రామ్‌లో కన్న తండ్రే టెన్నిల్ ప్లేయిరైన రాధిక యాదవ్‌ని తుపాకీతో కాల్చి చంపేసాడు. అయితే ఈ కేసులో నిందుతుడు దీపక్ యాదవ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కన్న కూతురు సంపాదించడం, రీల్స్ చేయడం వల్లే చంపానని స్వయంగా దీపక్ యాదవ్ విచారణలో ఒప్పుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆమె ఒక జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టెన్నిస్ క్రీడాకారిణి. అంతేకాదు రాధిక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేది. ఆమె గుర్తింపే.. ఆమె ఇష్టాలే ఇప్పుడు ఆమె ప్రాణాలు తీసేసాయి. వీటన్నింటినీ భరించలేక, సహించలేక కన్న తండ్రే నిర్ధాక్షణంగా నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. తన కూతుర్ని పొగుడుతూ ఉన్నా, తాను సంపాదించిన డబ్బు నువ్వు తింటున్నావని ఎవరైనా అన్నా.. తట్టుకోలేక కన్న కూతురిని కడతేర్చాడు. రాధికా యాదవ్‌ను దీపక్ యాదవ్ హత్య చేసిన తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో దీపక్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, తన సొంత ఊరు వజీరాబాద్ అయితే.. తమ ఊరి వాళ్లు నన్ను రాధిక విషయంలో వేధిస్తున్నారని, ఇష్టం వచ్చినట్లుగా మాటలు అంటున్నారని చెప్పాడు. దీపక్ ఇంకా ఏం చెప్పాడంటే.. కూతురు సంపాదిస్తుంటే తిని కూర్చుంటున్నావా? అని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. అందుకే నేను టెన్నిస్ అకాడమీని మూసివేయమని చెప్పాను. కానీ రాధిక నా మాట వినలేదు. పైగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది. కొన్ని నెలల క్రితం ఒక మ్యూజిక్ వీడియోని కూడా చేసింది. నాకు అది నచ్చలేదు. అందుకే చంపేశా.. అంటూ దీపక్ పోలీసుల విచారణలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

కన్న కూతురితో పోల్చి చూస్తే భరించలేకపోయాడు. కూతురు తనకంటే ఎత్తుకు ఎదుకుతుంటే సహించలేకపోయాడు. అందుకే ఆమెను తన తండ్రి కడతేర్చాడు. రాధికా వంటగదిలో వంట చేస్తున్నసమయంలో వెనకాల వెళ్లి రాధిక వీపుపై మూడు సార్లు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే తుపాకీ శబ్ధం వినిపించడంతో కింద అంతస్తులో ఉంటున్న రాధిక చిన్నాన్న వెంటనే పరుగు పరుగున వచ్చి చూస్తే రాధిక వంట గదిలో రక్తపు మడుగులో పడిపోయి ఉంది. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. కుల్దీప్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరిపారు. రాధిక హత్యకు ఆమె చేసిన మ్యూజిక్ వీడియోనే కారణమని తన తండ్రి చెప్పడంతో అందరూ విస్తుపోయారు. ఇలాంటి తండ్రులు కూడా ఈ సమాజంలో ఉన్నారా? అని ఆశ్చర్యపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories