Aadhaar Update: పిల్లల ఆధార్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయండి...తల్లిదండ్రులకు UIDAI ముఖ్య సూచన

Aadhaar Update: పిల్లల ఆధార్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయండి...తల్లిదండ్రులకు UIDAI ముఖ్య సూచన
x

Aadhaar Update: పిల్లల ఆధార్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయండి...తల్లిదండ్రులకు UIDAI ముఖ్య సూచన

Highlights

పిల్లల ఆధార్‌లో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరి అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) స్పష్టం చేసింది. ఏడు సంవత్సరాలు నిండిన పిల్లల ఆధార్‌లో బయోమెట్రిక్‌ సమాచారాన్ని తక్షణమే అప్‌డేట్‌ చేయాలని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సమీప ఆధార్‌ కేంద్రానికి వెళ్లి పిల్లల ఆధార్‌ వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేయవచ్చని తెలిపింది. ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్‌లో ఫొటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా వంటి వివరాలు మాత్రమే నమోదు చేస్తారని, వేలిముద్రలు, ఐరిస్‌ తీసుకోరని పేర్కొంది.

ఐదేళ్లు దాటిన వెంటనే పిల్లల వేలిముద్రలు, ఐరిస్‌, ఫొటోలను ఆధార్‌లో అప్‌డేట్‌ చేయడం తప్పనిసరిగా సూచించింది. ఐదు నుండి ఏడు సంవత్సరాల లోపు ఈ అప్‌డేట్‌ ఉచితంగా లభిస్తుందని, ఏడేళ్లు పూర్తయ్యాక అప్‌డేట్‌ కోసం రూ.100 ఫీజు వసూలు చేస్తారని స్పష్టం చేసింది.

బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సకాలంలో చేయకపోతే పిల్లల ఆధార్‌ నంబర్‌ డీయాక్టివేట్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాఠశాల అడ్మిషన్లు, పరీక్ష రిజిస్ట్రేషన్లు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ నగదు బదిలీ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేస్తూ ఉండాలని UIDAI సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories