Aam Aadmi Party: ఆప్ రెండో జాబితా రిలీజ్..13 సిట్టింగ్‎లకు దక్కని చోటు..సిసోడియా సీటు మార్పు

Aam Aadmi Party: ఆప్ రెండో జాబితా రిలీజ్..13 సిట్టింగ్‎లకు దక్కని చోటు..సిసోడియా సీటు మార్పు
x
Highlights

Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్త ముఖాలకు...

Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇవ్వగా,13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారంభించింది. 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీటును మార్చింది. ప్రతాప్ గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సిసోడియా ఈసారి జంగ్ పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్ గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించింది పార్టీ.పార్టీ అభ్యర్థుల రెండో లిస్టులో జితేంద్ర సింగ్ ఘంటి, సరిందర్ పాల్ సింగ్ బిట్టు పేర్లు ఉన్నాయి. బిట్టు ఈమధ్యే బీజేపీ నుంచి ఆమ్ ఆద్మీలో చేరారు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ రెండో జాబితాలో చోటు దక్కలేదు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రెండో జాబితాలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేసింది. టికెట్ నిరాకరించిన ప్రస్తుత ఎమ్మెల్యేలలో శరద్ చౌహాన్ (నరేలా), దిలీప్ పాండే (తిమర్‌పూర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), ధరంపాల్ లక్రా (ముండ్కా), ప్రహ్లాద్ సింగ్ సాహ్ని (చాందినీ చౌక్) ఉన్నారు. చాందినీ చౌక్ అసెంబ్లీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ సాహ్ని కుమారుడు పురందీప్ సింగ్ సాహ్నీకి టికెట్ ఇచ్చారు.


గిరీష్ సోని (మాదిపూర్), రాజేష్ రిషి (జనక్‌పురి), భూపిందర్ సింగ్ జూన్ (బిజ్వాసన్), భావన గౌర్ (పాలెం), ప్రకాష్ జర్వాల్ (డియోలీ), రోహిత్ కుమార్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), ప్రవీణ్ కుమార్ (జంగ్‌పురా) మరియు హాజీ యూనస్ (ముస్తఫాబాద్), SK బగ్గా (కృష్ణా నగర్). కృష్ణానగర్ ఎమ్మెల్యే ఎస్కే బగ్గా తనయుడు వికాస్ బగ్గాకు టికెట్ కేటాయించారు.

ఈ జాబితాలో మనీష్ సిసోడియా, ప్రవీణ్ కుమార్, రాఖీ బిర్లాన్ సీట్లు మారాయి. సిసోడియా పట్‌పర్‌గంజ్ స్థానాన్ని వదిలి జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. పట్పర్‌గంజ్ స్థానం నుంచి అవధ్ ఓజాకు టిక్కెట్టు ఇచ్చారు. రాఖీ బిర్లాన్ (మంగోల్‌పురికి బదులుగా మాదిపూర్) ప్రవీణ్ కుమార్ (జాంగ్‌పురా బదులుగా జనక్‌పురి) నుండి పోటీ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories