Top 6 News @ 6PM: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్... ఉత్కంఠరేపిన హై కోర్టు విచారణ

Top 6 News @ 6PM: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్... ఉత్కంఠరేపిన హై కోర్టు విచారణ
x
Highlights

1) Allu Arjun's Bail: మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు Allu Arjun gets bail: అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు...

1) Allu Arjun's Bail: మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Allu Arjun gets bail: అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను ఏ 11 గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. క్వాష్ పిటిషన్ అత్యవసరం కాదని.. సోమవారం వాదనలు వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Allu Arjun Arrest: రేవంత్ సహా ఎవరేవరు ఏమన్నారంటే?

చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టుపై శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలో ఆయన స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని ఆయన చెప్పారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతోనే పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.

అల్లు అర్జున్ అరెస్టు తీరు సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Mohan Babu's Anticipatory Bail Plea: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘటనలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా.. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మోహనబాబు అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషన్ పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

4) YS Jagan: మాజీ సీఎం జగన్ కు షాక్.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ, ఈడీ

YS Jagan: జగన్ ఆస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు(Supreme Court). సీబీఐ, ఈడీ కేసుల వివరాలను డిసెంబర్ 12న ఫైల్ చేశామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జగన్ కేసుల విచారణలో జాప్యంపై అఫిడవిట్ రూపంలో నివేదిక అందించారు. విచారణ ఎందుకు జాప్యం జరుగుతోంది అఫిడవిట్ లో వివరించిన దర్యాప్తు సంస్థలు. రిపోర్ట్ కాపీ పరిశీలిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం తెలిపింది. అయితే స్టేటస్ రిపోర్ట్ పరిశీలనకు జగన్ తరపు న్యాయవాదులు సమయం కోరారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన చంద్రబాబు

స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు. పది సూత్రాలు... ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. మంత్రులు , ఎమ్మెల్యేలు దీనిపై సంతకం చేశారు.

6) ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా క్రూయిజ్ క్షిపణులు, వైమానిక డ్రోన్ లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై రష్యా వాయు ప్రయోగ బాలిస్టిక్ కింజాల్ క్షిపణులను ఉపయోగించిందని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories