Viral Video: వ్యాన్ ఆపి.. వందలాది కోళ్లను కాపాడిన అనంత్ అంబానీ..వైరల్ వీడియో

Viral Video: వ్యాన్ ఆపి.. వందలాది కోళ్లను కాపాడిన అనంత్ అంబానీ..వైరల్ వీడియో
x
Highlights

Viral Video: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జామ్ నగర్ నుంచి ద్వారాకాకు పాదయాత్ర...

Viral Video: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జామ్ నగర్ నుంచి ద్వారాకాకు పాదయాత్ర చేస్తున్న సమయంలో మూగజీవాలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో తారసపడిన వందలాది కోళ్లను రక్షించారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

శ్రీక్రిష్ణుడి భక్తుడు అయిన అనంత్ అంబానీ..తన 30వ జన్మదినాన్ని పురస్కరించుకుని ద్వారకాధీశుడైన శ్రీక్రిష్ణుడిని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 140కిలోమీటర్ల పాదయాత్రను 5రోజుల క్రితం ప్రారంభించారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో అనుకోని సన్నివేశం చోటుచేసుకుంది. కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ ను చూసిన అనంత్..ఆ వాహనాన్ని ఆపి అందులోని కోళ్లకు విముక్తి కల్పించారు. ఈ మేరకు యజమానికి డబ్బులు చెల్లించాలని తన బ్రుందానికి తెలిపారు. ఈ క్రమంలోనే తన చేతుల్లో ఓ కోడిని పట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెట్టిజన్లు సైతం జంతువుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమను కొనియాడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories