TOP 6 NEWS @ 6PM: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై టీడీపీ క్లారిటీ... దావోస్ నుండే చంద్రబాబు ఆదేశాలు
1) నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై? స్పందించిన టీడీపీ హై కమాండ్ నారా లోకేష్‌ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది టీడీపీ నేతలు చేస్తోన్న...
1) నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై? స్పందించిన టీడీపీ హై కమాండ్
నారా లోకేష్‌ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది టీడీపీ నేతలు చేస్తోన్న డిమాండ్స్‌పై పార్టీ అధిష్టానం స్పందించింది. ఈ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఇలాంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి నేతలు కూర్చుని చర్చించుకోవడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ శ్రేణులకు చెప్పింది. ఇక ఈ విషయంలో మీడియా ఎదుట ఎవ్వరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకూడదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుండి పార్టీకి ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) ఆర్‌జీకర్ జూనియర్ డాక్టర్ హత్య కేసు: సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు
ఆర్‌జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి కోల్‌కతా సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్ కు సోమవారం జీవిత ఖైదు విధించింది. రూ. 50 వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయనను దోషిగా జనవరి 18న కోర్టు నిర్ధారించింది. శిక్షను జనవరి 20న విధిస్తామని కోర్టు ప్రకటించింది. ఆగస్టు 9, 2024న ఆర్‌జీకర్ ఆసుపత్రి సెమినార్ హల్‌లో మృతదేహం కనిపించింది. అంతకుముందు రోజు ఆమె నైట్ షిఫ్ట్ లో పనిచేశారు.
డిన్నర్ సమయంలో పేరేంట్స్ తో ఫోన్ లో మాట్లాడారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని సహచర వైద్యులకు చెప్పిన ఆమె సెమినార్ హల్ కు వెళ్లింది. మరునాడు ఉదయం ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హల్ లో ఆమె డెడ్‌బాడీని గుర్తించారు.జూనియర్ డాక్టర్ హత్య నేపథ్యంలో కోల్ కతా హైకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. ఆగస్టు 13 న ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శిక్ష ఖరారు చేసే ముందు సంజయ్ రాయ్ ఏమన్నారంటే? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో ఏం మాట్లాడుకున్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ జ్యురిచ్ విమానాశ్రయంలో జనవరి 20న బేటీ అయ్యారు. తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ టూర్ కు వెళ్లారు. సింగపూర్ పర్యటన ముగించుకొని దావోస్ వెళ్లారు రేవంత్ రెడ్డి. జనవరి 19న దిల్లీ నుంచి చంద్రబాబు నేరుగా దావోస్ వెళ్లారు. జ్యురిచ్ ఎయిర్ పోర్టులో రెండు రాష్ట్రాల సీఎంలు కలుసుకున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి లోకేష్ కూడా సమావేశమయ్యారు.
రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రులు ఆహ్వానించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే అభివృద్ది కార్యక్రమాలపై సీఎంల మధ్య చర్చ జరిగిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నఅవకాశాలను ప్రపంచ ఆర్ధిక సదస్సులో సీఎంలు ప్రస్తావించనున్నారు. తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు డిన్నర్ మీట్లో పాల్గొంటారు. కోకాకోలా, ఎల్ జీ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Akhil Akkineni wedding date: హీరో అక్కినేని నాగార్జున ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. అఖిల్, జైనాబ్ వివాహంను ఇరు కుటుంబాలు మార్చి 24వ తేదీని ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్, జైనాబ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్ పెళ్లి కాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. అఖిల్ పెళ్లిని గ్రాండ్ గా జరిపేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులో పాటు క్రికెటర్లను కూడా ఆహ్వానించనున్నారని టాక్. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ఖోఖోలో ప్రపంచ విజేతగా భారత్.. విజయంలో తెలుగోడి పాత్ర..
ఖోఖోలో భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగుతుందనుకున్న పోరులో సునాయాసంగా భారత్ గెలిచింది. ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచి వరుసగా పాయింట్లు సాధించిన మహిళల జట్టు.. ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే అత్యుత్తమ ఆటతీరు కనబర్చారు. సారథిగా జట్టును ముందుండి నడిపించారు. వైష్ణవి పవార్, సంజన, ప్రియాంక, చైత్ర భారత్ తరపున పాయింట్లు సాధించి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఇక పురుషుల జట్టు కూడా ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్ తో జరిగిన ఫైనల్ పోరులో పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54-36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలి రౌండ్‌లో 26-18 ఆధిక్యంలో నిలిచిన భారత్ అదే జోరును చివరి వరకు కొనసాగించింది. మూడో రౌండ్ లో భారత పురుషులు మరింత దూకుడుతో ఇంకో 28 పాయింట్లు సొంతం చేసుకున్నారు. ఇక చివరి టర్న్‌లో నేపాల్ 18 పాయింట్లే చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే ఇక్కడ మహిళలు, పురుషుల ప్రత్యర్థి జట్లు నేపాల్‌వే కావడం గమనార్హం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ జీతం ఎంత? కల్పించే సకల సౌకర్యాలు ఏంటో తెలుసా?
Donald Trump remuneration: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, వివిధరంగాల ప్రముఖులు వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ అందుకునే జీత భత్యాలు ఎంత? అతనికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటి? అధ్యక్షుడికి ఎలాంటి భద్రత ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు అనగానే ముందుగా గుర్తొచ్చేంది వైట్ హౌస్. దీనినే శ్వేత సౌధం అని కూడా పిలుస్తారు. అమెరికా అధ్యక్షుడిని శ్వేతసౌధానికి అధిపతి అని కూడా అంటారు. ఆరు అంతస్తుల ఈ భవనాన్ని 1800లో నిర్మించారు. తర్వాత కాలక్రమేణా హంగులు జోడించుకుంటూ వస్తున్నారు. 55,000 వేల చదరపు అడుగులు కలిగిన ఈ భవనంలో 132 గదులు, 35 బాత్ రూమ్‌లు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire