Assembly Election 2026: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: ఏప్రిల్‌లో పోలింగ్.. ఈసీపై మమతా బెనర్జీ 'తుగ్లక్' విమర్శలు!

Assembly Election 2026: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: ఏప్రిల్‌లో పోలింగ్.. ఈసీపై మమతా బెనర్జీ తుగ్లక్ విమర్శలు!
x

Assembly Election 2026: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా: ఏప్రిల్‌లో పోలింగ్.. ఈసీపై మమతా బెనర్జీ 'తుగ్లక్' విమర్శలు!

Highlights

Assembly Election 2026: దేశంలో ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది.

Assembly Election 2026: దేశంలో ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో వివిధ తేదీల్లో జరగనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఎన్నికల సంఘం మార్చి రెండు లేదా మూడో వారంలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికార వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. కాగా తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బంగాల్‌ అసెంబ్లీలకు గడువు మే నెలలో ముగియనుంది. అదేవిధంగా పుదుచ్చేరి అసెంబ్లీ గడువు కూడా జూన్‌ 15 నాటికి ముగుస్తోంది.

2021 జరిగి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎనిమిది దశల్లో నిర్వహించారు. అస్సాంలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఎన్నికలు జరగనున్న ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల అధికారులను సమాయత్తం చేస్తున్నారు.

ఇక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాకు సంబంధించి తుది ప్రకటన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు. అస్సాంలో ఎస్ఐఆర్​ ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 10న తుది జాబితా విడుదలైంది పుదుచ్చేరి ఫిబ్రవరి 14న తుది ఓటరు జాబితాను విడుదల చేసింది.తమిళనాడు కూడా త్వరలో తుది జాబితాను ప్రకటించనుంది. అదేవిధంగా, కేరళలో ఫిబ్రవరి 21న తుది జాబితా విడుదల కానుంది. ఒక పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 28న ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో లేదా గరిష్ఠంగా రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని స్థానిక రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఏప్రిల్ 14న బిహు పండుగ రావడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాలని కూడా విజ్ఞప్తి చేశాయి. మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ కుమార్ నేతృత్వంలోని పూర్తి స్థాయి కమిషన్ బృందం అసోంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహిస్తోంది.

మరోవైపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘం మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ ఆదేశానుసారం ఓటరు జాబితాల్లో మార్పు చేర్పులు చేస్తోందని విమర్శించారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బందుల పాలుచేసిన ఢీల్లీ చక్రవర్తి సుల్తాన్‌ మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌లా, జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌లా వ్యవహరిస్తూ కమిషన్‌ బెంగాల్‌ ఓటర్లను యాతనలకు గురిచేసిందని ధ్వజమెత్తారు ఈసీ నిబంధనల్ని ఉల్లంఘిస్తోంది, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తోంది, అది సృష్టించిన అయోమయం కారణంగా మరణాలు కూడా సంభవించాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓటరు నిర్ధారణకు ఆమోదిస్తున్న డాక్యుమెంట్లను పశ్చిమ బెంగాల్‌లో ఆమోదించడం లేదని ఆరోపించారు. బెంగాల్‌ భారతదేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు.

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ కారణంగా తలెత్తిన మానసికాందోళన, పని ఒత్తిడి 160 మరణాలకు కారణమైందన్నారు మమతా బెనర్జీ. రాష్ట్రం నుంచి నియమించిన ఏడుగురు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడంపై ప్రశ్నించారు. అధికారులకు విచారణ లేదా షో-కాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. వారిలో కొందరు ఎస్ఐఆర్​ ప్రక్రియను సజావుగా అమలు చేయడానికి కృషి చేశారన్నారు. తాము ప్రజల, అధికారుల వెంటే ఉన్నామని, ఎప్పటికీ వారితోనే ఉంటామని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వ అధికారులను బాధితులుగా చేస్తే, 100 శాతం వారిని రక్షిస్తామని తెలిపారు. తన నియోజకవర్గం భోవానిపుర్‌లో రెండు లక్షలకు పైగా ఓటర్లలో 40,000 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్ విషయంలో ఇప్పటికే హరియాణా, బిహార్, మహారాష్ట్రల్లో ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడు బెంగాల్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? బీజేపీని సంతోషపెట్టడానికే ఈసీ ఇదంతా చేస్తోంఅని మమతఆరోపించారు.

ఇలాలా ఉంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకంగా మారాయి. అస్సాం ఇప్పటికే బీజేపీ పాలనలో ఉంది గతేడాది బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాల ఊపులో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ కోటను బద్దలు కొట్టాలని బీజేపీ చూస్తోంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో భాగస్వామి మమతా బెనర్జీతో కాంగ్రెస్‌కు పొత్తు కుదరడం లేదు. మరోవైపు అస్సాంలో హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది. తమిళనాడు, కేరళలో బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ పరిస్థితి సందిగ్ధంలో ఉంది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు ఓ సవాలుగా మారాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories