Big Changes From 1st July: జులై 1 నుండి వీటి ధరల్లో మార్పులు వస్తున్నాయ్.. జర చూసుకోండి

Big Changes From 1st July: జులై 1 నుండి వీటి ధరల్లో మార్పులు వస్తున్నాయ్.. జర చూసుకోండి
x

Big Changes From 1st July: జులై 1 నుండి వీటి ధరల్లో మార్పులు వస్తున్నాయ్.. జర చూసుకోండి

Highlights

Big Changes From 1st July: జులై 1,2025 నుండి రైల్వే టికెట్లు, ఆధార్ పాన్ లింక్, గ్యాస్ ధరలు వంటి వాటలో కొత్త రూల్స్ రానున్నాయి.

Big Changes From 1st July: జులై 1,2025 నుండి రైల్వే టికెట్లు, ఆధార్ పాన్ లింక్, గ్యాస్ ధరలు వంటి వాటలో కొత్త రూల్స్ రానున్నాయి. ఈ రూల్స్ సాధారణ ప్రజల రోజువారీ ఖర్చులు, సౌలభ్యాలన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నాయి. కాబట్టి ఏయే రంగాల్లో ఏయే మార్పులు వచ్చాయన్నది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా రానున్న మార్పులతో సమాన్యుల లైఫ్ స్టైల్ మారనుంది. రైల్వే టికెట్ బుకింగ్ నియమాలు, ఎల్‌పిజీ సిలిండర్ ధరలు అదేవిధంగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ సంబంధిత విషయాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అవన్నీ జులై 1 నుండి అమలులోకి రానున్నాయి.

సిలిండర్ ధరలో మార్పులు

ప్రతి నెల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లలో మార్పులు వస్తాయి దీని ప్రకారం జులై 1న గ్యాస్ ధర మారుతుంది. అయితే అది ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుందా? తెలీదు. కానీ ఈ సారి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేద జేబులకు చిల్లుపడే అవకాశం కనిపిస్తుంది.

పాన్ కార్డ్‌కు ఆధార్ లింక్

పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి. ఇక జులై 1 తర్వాత కొత్త పాన్ కార్డులు తీసుకునేవారు కచ్చితంగా ఆధారకార్డు అవసరం. ఆధార్ కార్డు లేకుండా కొత్త పాన్ కార్డ్ రాదు. అంతేకాదు, ఇప్పటివరకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయనివాళ్లు డిసెంబర్ 31 వరకు లింక్ చేయాలి.

ఐసిఐసిఐ విత్‌డ్రా

ఐసిఐసిఐ బ్యాంకులో కొన్ని మార్పులు వచ్చాయి. ఇక నుంచి ఎంతబడితే అంత ఈ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే వీలు లేదు. దీనికొక పరిమితిని తీసుకొచ్చారు. దాని ప్రకారమే డబ్బును విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

రైల్వే టికెట్ బుకింగ్

జులై 1 నుంచి రైల్వే టికెట్ నియమాలు అమల్లోకి రానున్నాయి. టికెట్ బుకింగ్, ఛార్జీలతో మార్పులు వచ్చాయి. ఎసి, నాన్ ఎసి తరగతుల టిక్కెట్ ధరలను ఇటీవల స్వల్పంగా పెంచారు. ఏసీకి కిలోమీటర్‌‌కు రెండు పైసలు, నాన్ ఏసీకి కిలోమీటరుకు ఒక పైసా చొప్పున రేట్లు పెరిగాయి. ఇవి జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

వెయింటింగ్ టికెట్ల సంఖ్య పరిమితి

ఇక నుంచి రైలులో వెయింట్ టికెట్ల సంఖ్యపై కూడా పరిమితిని విధించారు. ప్రతి తరగతిలో ఉన్న మొత్తం సీట్లో 25 శాతానికి మించి వెయింటింగ్ టికెట్లు ఇక ఇవ్వరు. అంటే ఒక కోచ్‌లో ఒక 200 సీట్లు ఉంటే ఇందులో గరిష్టంగా 50 వెయింటింగ్ టికెట్లు మాత్రమే ఇస్తారు. అయితే మహిళలు, ప్రత్యేక వికలాంగుల ప్రయాణికుల్లో మాత్రం సడలింపు ఉంది.

తత్కాల్ టికెట్‌కు ఓటీపీ తప్పనసరి

ఇక నుంచి ఐఆర్‌‌సిటిసి నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ చేయాలనుకుంటే దానికి ఆధార్ లింక్‌తో పాటు ఓటీపీ కూడా తప్పనిసరి అయింది. జులై 15 నుండి తత్కాల్ బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ లింక్‌తో ఉన్న మొబైల్ నెంబర్‌‌కు ఓటీపీ వస్తుంది. అంది ఎంటర్ అయితేనే టికెట్ బుక్ అవుతుంది. అది ఎంటర్ చేయకపోతే టికెట్‌ను బుక్ చేయలేరు.

రైల్వే ఏంజెట్ల బుకింగ్‌లలో నియమాలు

వీటితో పాటు రైల్వే ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు రైల్వే డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రైల్వే ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల వరకు ఎటువంటి టికెట్ బుక్ చేయలేరు. అరగంట తర్వాతే వీరు బుక్ చేయగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories