Bihar Assembly Elections 2025: బిహార్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర

Bihar Assembly Elections 2025: బిహార్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర
x

Bihar Assembly Elections 2025: బిహార్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర

Highlights

Bihar Assembly Elections 2025: బిహార్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.

Bihar Assembly Elections 2025: బిహార్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ అయింది. బిహార్‌లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు రెండు దఫాలుగా పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6న పోలింగ్‌ ప్రక్రియ పూర్తవనుంది. పోలింగ్‌ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అన్ని స్థానాలకు ఎన్నికల సిబ్బందిని, పోలీసులను తరలిస్తున్నారు.

సమస్యాత్మక స్థానాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 11న రెండో విడత పోలింగ్‌ నిర్వహించనుండగా.. ఫలితాలు నవంబర్‌ 14న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం కల్పించారు. తొలిసారిగా బిహార్ ఎన్నికల నుంచి అభ్యర్థుల ఫొటోలతో ఈవీఎంలను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories