Bihar Election 2025 Phase 2 Voting: రికార్డు స్థాయిలో బిహార్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్.. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన

Bihar Election 2025 Phase 2 Voting: రికార్డు స్థాయిలో బిహార్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్.. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన
x

Bihar Election 2025 Phase 2 Voting: రికార్డు స్థాయిలో బిహార్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్.. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన 

Highlights

Bihar Election 2025 Phase 2 Voting: బీహార్‎లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 2025, నవంబర్ 6న 121 సీట్లకు పోలింగ్ జరిగింది.

Bihar Election 2025 Phase 2 Voting: బీహార్‎లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 2025, నవంబర్ 6న 121 సీట్లకు పోలింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్‎లో భాగంగా దాదాపు 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నితీశ్ కేబినెట్‎లోని సగానికి పైగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు చివరి దశలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బిహార్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.62 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. చివరి దశ పోలింగ్ లో భాగంగా ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు క్యూకట్టారు బీహార్ ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. రెండు గంటల్లోనే దాదాపు 17 శాతం ఓటింగ్ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోలింగ్ సరళిని నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా చూడాలా లేక..వ్యతిరేక పవనాలు వీచనున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories