బిహార్‌లో పోలింగ్ పర్సంటేజ్‌పై ఉత్కంఠ..పెరుగుతున్న పోలింగ్ శాతం దేనికి సంకేతం..?

బిహార్‌లో పోలింగ్ పర్సంటేజ్‌పై ఉత్కంఠ..పెరుగుతున్న పోలింగ్ శాతం దేనికి సంకేతం..?
x

బిహార్‌లో పోలింగ్ పర్సంటేజ్‌పై ఉత్కంఠ..పెరుగుతున్న పోలింగ్ శాతం దేనికి సంకేతం..?

Highlights

దేశ ప్రజల చూపంతా బిహార్‌ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. నవంబర్ 6న 121 నియోజకవర్గాలకు జరిగిన తొలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 64.65శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దేశ ప్రజల చూపంతా బిహార్‌ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. నవంబర్ 6న 121 నియోజకవర్గాలకు జరిగిన తొలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 64.65శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే ఊపులో రెండో విడతలోనూ కొనసాగుతుందా..? అదే ఊపు సాగితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం, అది ప్రభుత్వాల తలరాతను ఎలా మార్చిందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 55.68గా నమోదైంది. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. తొలి విడతలో 71 సీట్లలో పోలింగ్ జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బిహార్‌లో 17 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం 5కంటే పెరిగినా... తగ్గినా కూడా అధికార మార్పిడి జరిగినట్లు బిహార్ ఎన్నికల చరిత్ర చెబుతోంది.

బిహార్‌‌లో 1951లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 39.5 శాతం పోలింగ్ నమోదు కాగా, కాంగ్రెస్ గెలిచింది. 1957లో 41.3 శాతం పోలింగ్‌తో కాంగ్రెస్ అధికారం నిలుపుకొంది. 1962లో 44.5 శాతం పోలింగ్‌తో తిరిగి కాంగ్రెస్ గెలిచింది. 1967లో 51.5 శాతం పోలింగ్ జరిగింది. ఆ ప్రకారం 7 శాతం పోలింగ్ పెరిగింది. జన్ క్రాంతి దళ్ సారథ్యంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1969లో 52.8 శాతంతో అస్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో 1972లో జరిగిన ఎన్నికల్లో 52.8 శాతం పోలింగ్‌ జరిగి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ నడిచింది. 1977లో 50.5 శాతం పోలింగ్‌తో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

1980లో 57.3 శాతం పోలింగ్ జరిగి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1985లో 56.3 శాతం పోలింగ్‌తో కాంగ్రెస్ గెలిచింది. 1990లో 62 శాతం పోలింగ్ జరిగి జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో 61.8 శాతం పోలింగ్ జరిగి ఆర్జేడీ తిరిగి అధికారం నిలబెట్టింది. 2000లో 62.6 శాతం పోలింగ్ జరిగి ఆర్జేడీ పదవిలో కొనసాగింది. 2005 లో 46.5 శాతం పోలింగ్ జరిగి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగి రాష్ట్రపతి పాలనకు దారితీస్తే, అక్టోబర్ ఎన్నికల్లో నితీష్ కుమార్ సీఎం అయ్యారు. 2010లో 52.7 శాతం పోలింగ్ జరిగి ఎన్డీయే అధికారం నిలబెట్టుకుంది. 2015లో 56.7 శాతం పోలింగ్ జరిగింది. ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. 2020లో 56.9 శాతం పోలింగ్ జరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories