Mobile e-Voting: మొబైల్ యాప్‌ ద్వారా ఓటింగ్..బీహార్‌‌లో తొలి ప్రయత్నం

Mobile e-Voting
x

Mobile e-Voting: మొబైల్ యాప్‌ ద్వారా ఓటింగ్..బీహార్‌‌లో తొలి ప్రయత్నం

Highlights

Mobile e-Voting: భారతదేశంలోని పౌరులు తొలిసారిగా మొబైల్ యాప్‌ ద్వారా ఓటుహక్కుని వినియోగించుకోనున్నారు. తన రాష్ట్ర పౌరులకు ఈ అవకాశాన్ని ఇచ్చి బీహార్ రాష్ట్రం చరిత్ర సృష్టించింది.

Mobile e-Voting: భారతదేశంలోని పౌరులు తొలిసారిగా మొబైల్ యాప్‌ ద్వారా ఓటుహక్కుని వినియోగించుకోనున్నారు. తన రాష్ట్ర పౌరులకు ఈ అవకాశాన్ని ఇచ్చి బీహార్ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. శనివారం జరుగుతున్న ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ అవకాశం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేని ఓటర్లకు మాత్రమే.

త్వరలో బీహార్‌‌లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కౌన్సిళ్లకు జరుగుతున్న ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు ఓటుహక్కును వేయనున్నారు. ఇలా మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే వారిలో గర్భిణీలు, దివ్యాంగులు, వృద్దులు, వలస కార్మికులు ఉన్నారు. వీరంతా తమ దగ్గర ఉన్న మొబైల్‌లో ఎన్నికల యాప్‌లోకి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.

మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే వారి గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ మాట్టాడుతూ, ఓటర్లు ఈ సదుపాయాన్ని కొత్త ఇ-ఎస్ఇసిబిహెచ్ఆర్ (E-SECBHR) మొబైల్ యాప్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఉపయోగించుకోవాలని సూచించారు. దీనికోసం యాప్‌ను చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ యాప్‌లో మోసాలు జరిగితే వాటిని కనిపెట్టేలా ఈ యూప్‌ని రూపొందించామని, మోసాలను అరికట్టడానికి బ్లాక్ చెయిన్, ఫేస్ మ్యాచింగ్, స్కానింగ్ వంటి అధునాత సాంకేతికతలను యాప్‌లో సమకూర్చామని దీపక్ అన్నారు.

యాప్‌లో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయడంతో ఓటు వేసే హక్కు వస్తుంది. ఆ తర్వాత మీరు ఓటు వేసిన తర్వాత ఓటు సక్సెస్‌ఫుల్‌గా అయినట్లు మీకు మెసేజ్ వస్తుంది. అయితే ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా సరైన ఇంటర్నెట్ కూడా ఓటింగ్‌కు చాలా అవసరం. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిషియల్ వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories