పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో పెళ్లికూతురు మృతి

పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో పెళ్లికూతురు మృతి
x

పెళ్లింట తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో పెళ్లికూతురు మృతి

Highlights

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ జిల్లా బర్గారి గ్రామంలో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది.

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ జిల్లా బర్గారి గ్రామంలో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. వివాహానికి ఒకరోజు ముందు జరిగిన జాగరణ్‌ వేడుకలో ఉత్సాహంగా నృత్యం చేస్తున్న వధువు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించింది.

బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ప్రస్తుతం దుబాయ్‌లో పనిచేస్తున్న ఆ యువకుడితో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇటీవలే వీడియో కాల్ ద్వారా వారి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 24న వారి వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి కుమారుడు దుబాయ్ నుంచి వచ్చేశాడు.

అక్టోబర్‌ 23వ తేదీ రాత్రి, పెళ్లికి ముందు సాంప్రదాయం ప్రకారం వధువు ఇంట్లో జాగరణ్‌ (మెహందీ/సంగీత్) వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆనందోత్సాహాల మధ్య పూజ భాంగ్రా నృత్యం చేస్తూ అందరినీ ఉర్రూతలూగించింది. అయితే, ఉన్నట్టుండి ఆమెకు ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

అయితే, చికిత్స ప్రారంభించేలోపే తీవ్రమైన గుండెపోటుతో పూజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న మొన్నటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఇంట ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి బాజాలు, వేడుకలు జరగాల్సిన చోట ఏడుపులు, రోదనలు మిన్నంటాయి. పెళ్లికి సిద్ధమైన వధువు మరణంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories