లవర్‌తో బెట్టింగ్.. గూగుల్ మ్యాప్ చూస్తూ కారును సముద్రంలోకి నడిపిన యువకుడు!

లవర్‌తో బెట్టింగ్.. గూగుల్ మ్యాప్ చూస్తూ కారును సముద్రంలోకి నడిపిన యువకుడు!
x

లవర్‌తో బెట్టింగ్.. గూగుల్ మ్యాప్ చూస్తూ కారును సముద్రంలోకి నడిపిన యువకుడు!

Highlights

Car Gets Stuck in Sea: మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు చేసిన చేష్ట తమిళనాడులో తీవ్ర సంచలనం రేపింది.

Car Gets Stuck in Sea: మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు చేసిన చేష్ట తమిళనాడులో తీవ్ర సంచలనం రేపింది. కడలూరు హార్బర్-పరంగిపేట తీరప్రాంతం వద్ద సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారని బెట్టింగ్ వేసుకుని, ఓ యువకుడు గూగుల్ మ్యాప్‌ సహాయంతో కారును సముద్రంలోకి తీసుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

చెన్నైకి చెందిన ఐదుగురు యువకులు - ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు - సరదా కోసం కడలూరు తీర ప్రాంతానికి వచ్చారు. అక్కడ తాగిన మైకంలో, సముద్రంలోకి కారు నడిపే సాహసం ఎవరైనా చేస్తారా అని ఒకరికొకరు సవాల్ చేసుకున్నారు. ఆ సవాల్‌ను స్వీకరించిన ఒక యువకుడు తన లవర్‌తో కలిసి గూగుల్ మ్యాప్ చూస్తూ సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు.

అయితే, సోధికుప్పం వద్ద మిగిలిన నలుగురిని రోడ్డుపైనే దింపి, అతడు ఒక్కడే కారులో సముద్రంలోకి వెళ్లాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు సముద్రంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ, అతడికి ఏమీ కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. సముద్రపు అలల తాకిడికి కారు తేలుతూ కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాక్టర్ సహాయంతో కారును బయటకు తీసుకొచ్చారు. పోలీసులు ఆ ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగిన మత్తులో ఇలాంటి విపరీత పోకడలకు పోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories